అమరావతి: తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు ఏ ప్రాతిపదికన విభజించారో చెప్పాలని హైకోర్టులో శుక్రవారం నాడు పిటిషన్  దాఖలైంది. ఈ పిటిషన్‌పై సోమవారం నాడు విచారణను వాయిదా వేసింది.

తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాల కోసం జారీ చేసిన  జీవో  చూపాలని పిటిషనర్ తరపు న్యాయవాది టీటీడీని కోరారు.  L1,L2,L3 దర్శనాలు  రద్దుచేయాలని  పిటిసనర్ కోరారు.

భక్తులందరిని సమానంగా చూడాలని పిటిషనర్ వాదించారు. వీఐపీ బ్రేక్ దర్శనాలపై పూర్తి వివరాలు ఇవ్వాలని  ఆదేశించారు. ఈ విషయమై ఏపీ ప్రభుత్వం, టీటీడీ స్టాండింగ్ కమిటీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.ఈ పిటిషన్‌పై విచారణను సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు.