తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో  ఓ వస్త్ర వ్యాపారి కుటుంబాన్ని కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు  నిందితులను అదుపులోకి తీసుకొన్నారు.

వస్త్ర వ్యాపారి  శివప్రసాద్ కుటుంబాన్ని దుండగులు కిడ్నాప్ చేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు. శివప్రసాద్ తో పాటు ఆయన భార్య, ఇద్దరు పిల్లలను హైద్రాబాద్ కు కిడ్నాపర్లు తీసుకెళ్తున్న సమయంలో  పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

వ్యాపార లావాదేవీల్లో చోటు చేసుకొన్న విబేధాల వల్లే వ్యాపారి కుటుంబాన్ని కిడ్నాప్ చేశారని పోలీసులు గుర్తించారు. వ్యాపార లావాదేవీల్లో విబేధాల కారణంగానే ఫైనాన్షియర్లే శివప్రసాద్ కుటుంబాన్ని కిడ్నాప్ చేయించినట్టుగా  పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ విషయమై పోలీసులు నిందితులను విచారిస్తున్నారు. వ్యాపారంలో చోటు చేసుకొన్న విబేధాల కారణంగానే కిడ్నాప్ చేశారా.. ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. 

ఈ కిడ్నాప్ వెనుక ఎవరున్నారనే విషయమై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.ఈ విషయం పట్టణంలో కలకలం రేపింది. అయితే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకోవడంతో వ్యాపారి బంధవులు, కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకొన్నారు. ఈ విషయమై పోలీసులు నిందితుల గురించి మీడియాకు సమాచారాన్ని ఇచ్చే అవకాశం ఉంది.