వీక్లీ ఆఫ్‌లను అమలు చేస్తారు. వీక్లీ ఆఫ్‌ల విషయంలో  19 మోడల్స్‌ ఎంపిక చేశారు. వీటి అమలు తర్వాత లోటుపాట్లను చర్చించిన తర్వాత  మార్పులు చేర్పులు చేస్తారు.

ఏపీలో  వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైంది. పోలీసులకు వీక్లీ ఆఫ్‌లు ఇవ్వనున్నట్టుగా  ఏపీ సీఎం  ప్రకటించారు.ఈ హామీ మేరకు పోలీసు శాఖ  నిర్ణయం తీసుకొంది. బుధవారం నుండి ఏపీలో పనిచేసే పోలీసులకు వీక్లీ ఆఫ్‌లు అమలు చేస్తున్నారు.

 వీక్లి ఆఫ్ ల కారణంగా  షిఫ్ట్ డ్యూటీలు కూడ పోలీసు శాఖల్లో అమలు కానున్నాయి. షిఫ్ట్ డ్యూటీల కారణంగా 20 శాతం ఖాళీలను భర్తీ చేయనున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా 12,300 ఖాళీలు ఉన్నాయి. 

వీక్లి ఆఫ్‌లు అమలులో 19 మోడల్స్‌లో తమకు ఇష్టమున్న విధానాన్ని అధికారులు తీసుకోవచ్చని  అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ చెప్పారు. పోలీసు అధికారుల నుండి వచ్చే  సూచనలు, సలహాల ఆధారంగా  ఈ విధానంలో మార్పులు చేర్పులు చేయనున్నట్టుగా ఆయన ప్రకటించారు.