తూర్పు మధ్య బంగాళాఖాతంలో స్పష్టమైన అల్పపీడనం ఏర్పడింది. ఇది రేపటికల్లా బలపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా.
ఆ వాయుగుండం పశ్చిమ వాయవ్యంగా పయనిస్తూ ఈనెల 12 ఉదయం నాటికి ఉత్తరాంధ్ర వద్ద తీరం దాటుతుంది.

దీని ప్రభావం తెలుగురాష్ట్రాల మీద రేపు ఎల్లుండీ అత్యధికంగా ఉంటుంది. ఈ రోజు శనివారం కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమల్లో తేలికపాటినుంచీ ఓ మోస్తరు వర్షం పడుతుంది. కోస్తాంధ్ర తెలంగాణల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఈ వాయుగుండం ప్రభావం తమిళనాడు కర్నాటక మహారాష్ట్రలమీద కూడా ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఎగువ రాష్ట్రాల్లోని వర్షాలకు మరోసారి కృష్ణ గోదావరులకు వరద ప్రవాహాలు పెరగవచ్చని అంచనా.

తీరప్రాంత మత్స్యకారులు నేడు, రేపు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు. లోతట్టు సముద్రంలోకి పోవద్దని సూచిస్తున్నారు. ఆదివారం తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల వేటకు వెళ్లవద్దని హెచ్చిరిస్తున్నారు.