Asianet News TeluguAsianet News Telugu

కందుకూరు, గుంటూరు తొక్కిసలాట కారకులపై చర్యలు తప్పవు: ఏపీ మంత్రి రోజా వార్నింగ్

పేద ప్రజల ప్రాణాలంటే చంద్రబాబుకు పట్టింపు లేదని  ఏపీ మంత్రి రోజా చెప్పారు.  తన పబ్లిసిటీ పిచ్చి కోసం  ప్రజల ప్రాణాలను చంద్రబాబు బలి తీసుకుంటున్నాడన్నారు. 

We Will Take necessary action in kandukur, Guntur Stampede incident:AP minister Roja
Author
First Published Jan 2, 2023, 3:07 PM IST

అమరావతి: చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి  అమాయకులు  బలైపోతున్నారని  ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా  విమర్శించారు.  సోమవారం నాడు తాడేపల్లిలో  రోజా  మీడియాతో మాట్లాడారు.కందుకూరులో  ఇరుకు సందులో  సభ పెట్టి ఎనిమిది మంది మృతికి చంద్రబాబు కారణమయ్యారని  ఆమె ఆరోపించారు. గుంటూరులో  కానుకల పేరుతో  ముగ్గురు  అమాయకుల  ప్రాణాలను  బలి తీసుకుంటున్నారని  మంత్రి  రోజా  విమర్శించారు. 

చంద్రబాబునాయుడు సీఎంగా  ఉన్న సమయంలో  గోదావరి పుష్కరాల్లో  29 మందిని  పొట్టనబెట్టుకున్నారన్నారు.  కందుకూరు సభలో ఎనిమిది మృతికి  చంద్రబాబే కారణమని మంత్రి రోజా విమర్శించారు.  పేదవాడి ప్రాణాలంటే  చంద్రబాబుకు అంత చులకనా అని మంత్రి రోజా ప్రశ్నించారు. కందుకూరు, గుంటూరు తొక్కిసలాట ఘటనలపై ప్రభుత్వం  సీరియస్ గా తీసుకుంటుందని  మంత్రి రోజా చెప్పారు. ఈ ఘటనలకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని  మంత్రి రోజా  స్పష్టం చేశారు. చంద్రబాబు తప్పుడు  మాటలను  ప్రజలు  పట్టించుకొనే పరిస్థితి లేదన్నారు. పవన్ కళ్యాణ్ కు, చంద్రబాబుకు  వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ది చెబుతారని  మంత్రి  తెలిపారు. కందుకూరు, గుంటూరులలో  జరిగిన తొక్కిసలాటలపై  .జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదో చెప్పాలని మంత్రి రోజా  ప్రశ్నించారు.  తన నోటీకి  హెరిటేజ్ ప్లాస్టర్ వేసుకున్నారా అని రోజా  పవన్ కళ్యాణ్ ను అడిగారు. 

లోకేష్ పాదయాత్రను ఆపేందుకు  తాము ప్రయత్నిస్తున్నామని టీడీపీ నేతలు  చేసిన విమర్శలను మంత్రి రోజా తప్పుబట్టారు.  లోకేష్ పాదయాత్రను ఆపాల్సిన  అవసరం తమకు లేదన్నారు.  లోకేష్ పాదయాత్ర  చేస్తే  పార్టీ ఇంకా  నష్టపోయే  అవకాశం ఉందని ఆ పార్టీ నేతల్లో ఆందోళన నెలకొందన్నారు. లోకేష్ పాదయాత్ర పోస్టర్ ను  ఆవిష్కరించిన  రోజునే కందుకూరులో  ఎనిమిది మంది  మృతి చెందారని  మంత్రి రోజా  చెప్పారు.తనను పట్టించుకోకుండా  దత్తపుత్రుడి వెంట వెళ్తున్నాడని  చంద్రబాబుపై లోకేష్ కోపంగా  ఉన్నాడన్నారు.ఎక్కడ లోకేష్ అడుగుపెట్టినా అక్కడ నాశనమేనని  మంత్రి రోజా  ఎద్దేవా  చెప్పారు. అందుకే   లోకేష్ పాదయాత్ర చేస్తానంటే  పార్టీ నేతలు  భయపడుతున్నారన్నారు. తాను సన్నబడడం కోసమే లోకేష్ పాదయాత్రను చేపట్టారని  మంత్రి రోజా చెప్పారు.

also read:గుంటూరు తొక్కిసలాటలో ముగ్గురు మృతి: పోలీసుల అదుపులో ఉయ్యూరు శ్రీనివాస్

 చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో  ఒక్క మంచి పనైనా చేశారా అని మంత్రి ప్రశ్నించారు. తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో  అన్ని వర్గాల ప్రజలను ఆదుకొంటున్నట్టుగా  మంత్రి తెలిపారు. చంద్రబాబు చేసిన అప్పుల కంటే  తక్కువ అప్పులతోనే  ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు  అమలు చేసిన ఘనత జగన్ కే దక్కుతుందని  రోజా  చెప్పారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న  పథకాలతో  రాష్ట్రంలోని  ప్రతి కుటుంబానికి  లబ్ది కలుగుతుందన్నారు మంత్రి. 

Follow Us:
Download App:
  • android
  • ios