Asianet News TeluguAsianet News Telugu

స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు: పేర్నినాని

స్థానిక  సంస్థల ఎన్నికల విషయంలో హైకోర్టు తీర్పుపై  సుప్రీంకోర్టుకు వెళ్తామని ఏపీ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని చెప్పారు.

We will file petition in supreme court on AP high court decision over local body elections :says perni nani lns
Author
Guntur, First Published Jan 21, 2021, 12:14 PM IST

అమరావతి: స్థానిక  సంస్థల ఎన్నికల విషయంలో హైకోర్టు తీర్పుపై  సుప్రీంకోర్టుకు వెళ్తామని ఏపీ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని చెప్పారు.ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గాను హైకోర్టు గురువారం నాడు  ఆదేశించిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పుపై మంత్రి నాని స్పందించారు.

ఎన్నికల కంటే తమకు ప్రజల ప్రాణాలే ముఖ్యమని మంత్రి తేల్చి చెప్పారు. నిమ్మగడ్డ అనుకొన్నంత మాత్రాన ఎన్నికల కోడ్ అమలు కాదని ఆయన చెప్పారు.ఈ విషయమై న్యాయ నిపుణులు, అధికారులతో చర్చిస్తున్నామని మంత్రి తెలిపారు. 

న్యాయమూర్తులు మారినా కూడ ధర్మం గెలవాలని తాము కోరుకొంటున్నామన్నారు.వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు గాను రాష్ట్ర ఎన్నికల సంఘం ఇదివరకే షెడ్యూల్ జారీ చేసింది. అదే షెడ్యూల్ ప్రకారంగా ఎన్నికలు జరుగుతాయని ఎస్ఈసీ ప్రకటించింది. ఈ విషయమై త్వరలోనే అధికారులతో ఎస్ఈసీ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.

కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ సాగుతున్నందున  స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ససేమిరా అంటోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios