కొత్త జిల్లాలపై లోతైన అధ్యయనం చేశాం: ప్లానింగ్ సెక్రటరీ విజయ్ కుమార్
కొత్త జిల్లాల ఏర్పాటుపై సమగ్రంగా అధ్యయనం చేశామని ఏపీ రాస్ట్ర ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయ్ కుమార్ చెప్పారు. గురువారం నాడు ఆయన ఈ విషయమై మీడియాతో మాట్లాడారు.
అమరావతి: New జిల్లాల ఏర్పాటుపై లోతైన అధ్యయనం జరిగిందని ప్రణాళికా విభాగం కార్యదర్శి విజయ్ కుమార్ చెప్పారు.గుడ్ గవర్నెన్స్ లో భాగంగానే కొత్త Districts ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. పాలనా వికేంద్రీకరణను దృష్టిలో ఉంచుకొని జిల్లాలను ప్రతిపాదించామన్నారు.
ప్రజల మనోభావాలను, చారిత్రక నేపథ్యాలను అధ్యయనం చేసినట్టుగా విజయ కుమార్ వివరించారు. భౌగోళిక విస్తీర్ణం, జన సాంద్రత ఆధారంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామన్నారు.
ప్రతి జిల్లాకు రెండు రెవిన్యూ డివిజన్లను ప్రతిపాదించినట్టుగా ఆయన వివరించారు. పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినట్టుగా ఐఎఎస్ అధికారి విజయ్ కుమార్ తెలిపారు. జిల్లాల వారీగా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని కొత్త జిల్లాల ఎంపికపై చర్యలు తీసుకొన్నామన్నారు. కొత్త జిల్లాలకు సరిహద్దులపై కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొన్నామని ఆయన వివరించారు.
రాష్ట్రంలో Tribal ప్రాంతం విస్తృత పరిధిలో ఉందన్నారు. ఈ గిరిజన ప్రాంతానికి ఒకే జిల్లా ఉంటే ఇబ్బందులుంటాయని భావించి రెండు జిల్లాలను ప్రతిపాదించామని విజయ్ కుమార్ వివరించారు.Assembly నియోజకవర్గాన్ని విడదీయకుండా జిల్లాల ఏర్పాటు చేశామన్నారు.
కొత్త జిల్లా కేంద్రానికి, పాత జిల్లా కేంద్రానికి మధ్య ఉన్న రవాణా సౌకర్యాలను కూడా పరిగణనలోకి తీసుకొన్నామని Vijay kumar తెలిపారు. వనరుల విషయంలో సమతుల్యతను కూడా పాటించామన్నారు. జిల్లాల పునర్విభజన ప్రాంతీయ అభివృద్దికి దోహదపడుతుందన్నారు. జిల్లా కేంద్రాలు అందరికీ దగ్గరుండేలా చూసుకొన్నామని విజయ్ కుమార్ తెలిపారు.
Vizianagaram విస్తీర్ణం కోసమే రాజాం ను ఆ జిల్లాలో కలిపినట్టుగా విజయ్ కుమార్ చెప్పారు. జిల్లా కేంద్రాలు అందరికీ దగ్గరుండేలా చూస్తుకొన్నామన్నారు.విజయనగరం అభివృద్ది దెబ్బతినకుండా జిల్లాను ఏర్పాటు చేసినట్టుగా ఆయన వివరించారు.
Srikakulamపేరున్న ఇనిస్టిట్యూట్‌లన్నీ ఎచ్చెర్లలోనే ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ కారణం చేతనే ఎచ్చెర్లను శ్రీకాకుళంలోనే ఉంచామని విజయ్ కుమార్ తెలిపారు.
పెందుర్తిని తీసేస్తే అనకాపల్లి వెనుకబడే అవకాశం ఉందని విజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు. దీంతో Anakapalleలోనే పెందుర్తిని ఉంచామన్నారు. భీమిలీకి గత ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని రెవిన్యూ డివిజన్ గా ఏర్పాటు చేసినట్టుగా ఐఎఎస్ అధికారి చెప్పారు. రంపచోడవరం అభివృద్ది కోసమే Alluri జిల్లాలో కలిపినట్టుగా ఆయన చెప్పారు.
1979 తర్వాత ఉమ్మడి Andhra Pradeshలో జిల్లాల పునర్విభజన జరగలేదని విజయ్ కుమార్ గుర్తు చేశారు.జిల్లాల పునర్విభజన ప్రాంతీయ అభివృద్దికి దోహదపడుతుందన్నారు. గతంలో కందుకూరు నెల్లూరు జిల్లాలో ఉండేదని, జిల్లాల పునర్విభజనలో భాగంగా కందుకూరును నెల్లూరు జిల్లాలోకి మార్చినట్టుగా విజయ్ కుమార్ తెలిపారు.కొత్త జిల్లాలన్నీ సుమారు 20 లక్షల చొప్పున జనాభా ఉందని ఆయన తెలిపారు.