ప్రజల సొమ్ము మాకు అవసరం లేదు: జగ్గంపేటలో చంద్రబాబు అరెస్ట్ పై భువనేశ్వరి

ప్రజల సొమ్ము తీసుకోవాల్సిన అవసరం తమ కుటుంబానికి అవసరం లేదని  చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చెప్పారు.

We dont want people money  says  Bhuvaneswari lns

అమరావతి: ఏం తప్పు చేశారని  చంద్రబాబును జైలులో పెట్టారని  భువనేశ్వరి ప్రశ్నించారు.సోమవారంనాడు తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేటలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం స్థానికంగా  ఉన్న ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. 

రాష్ట్రం కోసం కష్టపడటమే ఆయన చేసిన తప్పా  అని భువనేశ్వరి ప్రశ్నించారు. రాళ్లతో కూడిని హైటెక్ సిటీ ప్రాంతాన్ని చక్కని శిల్పంగా మార్చారన్నారు.  చంద్రబాబు ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచించారని ఆమె చెప్పారు.ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా వందల కోట్లు ఖర్చు చేస్తున్నామని భువనేశ్వరి చెప్పారు.చంద్రబాబు ఏ తప్పు చేయలేదని ఆమె తెలిపారు.చంద్రబాబుకు మద్దతుగా  కార్ల ర్యాలీని  పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారని భువనేశ్వరి గుర్తు చేశారు. తెలంగాణ నుండి ఏపీకి రావాలంటే వీసాలు, పాస్ పోర్టులు తీసుకోవాలా అని భువనేశ్వరి ప్రశ్నించారు. శాంతియుత  ర్యాలీ చేస్తుంటే ఎందుకు  భయపడుతున్నారని భువనేశ్వరి అడిగారు.మహిళలు బయటకు వచ్చి సంఘీభావం తెలుపుతున్నారన్నారు.

చంద్రబాబు ప్రజల మనిషి అని ఆమె తెలిపారు.తనతో పాటు ప్రజలను ముందుకు తీసుకెళ్లాలనేది ఆయన లక్ష్యంగా భువనేశ్వరి  చెప్పారు. తాను స్వయంగా  ఓ సంస్థను నడుపుతున్నట్టుగా భువనేశ్వరి ఈ సందర్భంగా ప్రస్తావించారు.తన సంస్థలో రెండు శాతం వాటా అమ్ముకున్నా రూ. 400 కోట్లు వస్తాయని భువనేశ్వరి చెప్పారు.  ఎన్టీఆర్ చూపిన బాటలలోనే చంద్రబాబు నడుస్తున్నారని భువనేశ్వరి తెలిపారు.45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు ఏనాడూ తప్పు చేయలేదని భువనేశ్వరి గుర్తు చేశారు.ప్రజల సొమ్ము తీసుకోవాల్సిన అవసరం తమ కుటుంబానికి లేదని భువనేశ్వరి స్పష్టం చేశారు.చంద్రబాబు కోసం మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి భువనేశ్వరి  ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం  చంద్రబాబును  రెచ్చగొడుతున్నారన్నారు.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios