విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తేల్చేసిన కేంద్రం

 విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోబోమని  కేంద్రప్రభుత్వం తేల్చేసింది. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి భగవత్ కిషన్ రావు లిఖితపూర్వకంగా విడుదల చేసింది.

we committed to Vishaka steel plant privatisation lns

అమరావతి:విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పునరాలోచన లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ మేరకు కేంద్ర మంత్రి భగవత్ కిషన్ రావు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి భగవత్ కిషన్ రావు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.  విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలని  కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.ఈ నిర్ఱయాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. కార్మిక సంఘాలు జేఎసీగా ఏర్పడి విశాఖలో  రిలేదీక్షలు నిర్వహిస్తున్నాయి. 

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని పరిరక్షించాలని కోరుతూ ఈ ఏడాది ఆగష్టు 1,2 తేదీల్లో  ఛలో పార్లమెంట్ కార్యక్రమానికి కూడ జేఎసీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలను కార్మిక సంఘాల జేఏసీ కోరుతోంది.విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను వైసీపీ, టీడీపీ, బీజేపీ సహా రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఏపీ అసెంబ్లీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ మేరకు ఓ తీర్మానం చేసింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios