Asianet News TeluguAsianet News Telugu

బీసీలను బ్యాక్‌బోన్ క్లాసులుగా మారుస్తాం: అసెంబ్లీలో వైఎస్ జగన్

బీసీలను బ్యాక్ బోన్ క్లాసులుగా మారుస్తామని ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన   కులాల వారీగా బీసీ గణన చేయాలని ప్రవేశ పెట్టిన తీర్మానంపై ఆయన ప్రసంగించారు.

We committed to BC welfare says AP Cm Ys Jagan
Author
Guntur, First Published Nov 23, 2021, 2:39 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

అమరావతి::బీసీలంటే బ్యాక్‌వర్డ్ క్లాసులు కాదు, బ్యాక్ బోన్ క్లాసులుగా మారుస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.ap assemblyలో  కులాల వారీగా బీసీ జన గణన జరగాలని ప్రవేశ పెట్టిన తీర్మానంపై సీఎం జగన్ ప్రసంగించారు. కులాల వారీగా బీసీ జనాభా ఎంతుందో అనే విషయమై ఎప్పుడూ మదింపు జరగలేదన్నారు. ఎప్పుడో 90 ఏళ్ల క్రితం కులాల వారీగా జన గణన జరిగిందని ఆయన గుర్తు చేశారు.  రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుండి  బీసీ జన గణన జరగలేదన్నారు.సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబాటుతనం ఎంతుందో తెలియాలంటే కుల గణన అవసరమని ఆయన చెప్పారు.  సమాజంలో కొద్దిమంది మాత్రమే అధికారం దక్కించుకొంటున్నారన్న భావన ఉందని సీఎం ys jagan అభిప్రాయపడ్డారు.  bc  కుల గణన జరగాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపుతున్నామని సీఎం తెలిపారు. కుల గణన జరిగితే మరింత వెసులుబాటు ఉంటుందన్నారు. బీసీలు ఎంతమంది ఉన్నారని తెలిస్తేనే వారికి న్యాయం చేయగలుగుతామన్నారు. 

chandrababu ప్రభుత్వంలో  బీసీలను కూడా విభజించారన్నారు. తమ పార్టీకి ఓటు వేసిన వారికి కొద్ది మేరకు పథకాలు ఇచ్చారన్నారు. ఓటు వేయని వారికి ప్రభుత్వ పథకాలను ఇవ్వలేదని జగన్ ఆరోపించారు. జన్మభూమి కమిటీలు ఎలా పనిచేశాయో చూశామని ఆయన గుర్తు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హుత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలను అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. తమ పార్టీకి ఓటు వేసినా వేయకపోయినా బీసీలంతా మనవారేనని ఆయన స్పష్టం చేశారు. 

ap legislative council లో 18 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలున్నారన్నారు. రాజ్యసభలో నలుగురిలో ఇద్దరు బీసీలున్నారని సీఎం గుర్తు చేశారు. . గత టీడీపీ హయంలో రాజ్యసభకు ఒక్క బీసీని కూడా పంపలేదని ఆయన విమర్శించారు.  శాసనసభ స్పీకర్ పదవిని బీసీలకు కేటాయించామన్నారు. శాసనమండలి ఛైర్మెన్ పదవిని దళితులకు ఇచ్చినట్టుగా సీఎం జగన్ తెలిపారు.

also read:కులాల వారీగా జన గణన చేయాలి: ఏపీ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టిన మంత్రి

ఈ రెండున్నర ఏళ్లలో తమ ప్రభుత్వం అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని సీఎం జగన్ గుర్తు చేశారు. సామాజిక న్యాయం దిశగానే తమ ,ప్రభుత్వం అడుగులు వేసిందన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా గొప్ప వ్యవస్థను తీసుకొచ్చామన్నారు. శాశ్వత బీసీ కమిషన్ ను కూడా నియమించుకొన్న విషయాన్ని సీఎం గుర్తు చేశారు.రాష్ట్రంలోని మున్సిపల్, జిల్లా పరిషత్ చైర్మెన్లలో మెజారిటీ స్థానాలు బీసీ, ఎస్సీ, ఎస్టీలకే కేటాయించినట్టుగా సీఎం ఈ సందర్భంగా ప్రస్తావించారు.  రాష్ట్రంలోని 87 మున్సిపాలిటీల్లో 84 స్థానాల్లో తమ పార్టీ విజయం సాధించిందన్నారు. కొండపల్లి మున్సిపాలిటీలో తమ పార్టీ విజయం సాధిస్తే మరో పదవి బీసీలకే దక్కనుందని సీఎం  చెప్పారు.

రాష్ట్రంలోని  648 మండలాల్లో వైసీపీ గెలుచుకొన్న 635 మండలాల్లో 239 ఎంపీపీ పదవులు బీసీలకు కేటాయించామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీలకు మొత్త 67 శాతం పదవులు ఇచ్చినట్టుగా సీఎం జగన్ తెలిపారు. దేశంలోని అన్ని కులాలను అంగీకరిస్తున్నారన్నారు. అయితే జన గణనకు అంగీకరించే పరిస్థితి లేదన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios