Asianet News TeluguAsianet News Telugu

కులాల వారీగా జన గణన చేయాలి: ఏపీ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టిన మంత్రి

కులాల వారీగా జన గణన చేయాలని  ఏపీ అసెంబ్లీలో మంత్రి గోపాలకృష్ణ తీర్మానం ప్రవేశ పెట్టారు.1931లో తీసిన లెక్కల ఆధారంగానే  కార్యక్రమాలు అమలు చేస్తున్నారని మంత్రి గుర్తు చేశారు

Ap minister Gopala krishna introduces  resolution on Caste wise bc census in Ap Assembly
Author
Guntur, First Published Nov 23, 2021, 1:31 PM IST

అమరావతి: కులాల వారీగా బీసీ జన గణన చేపట్టాలని ఏపీ అసెంబ్లీలో మంత్రి వేణుగోపాలకృష్ణ  తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ తీర్మానంపై ఆయన ప్రసంగించారు. సంక్షేమ పథకాల అమలుకు ఇది ఎంతో అవసరమన్నారు. బీసీలంటే దేశానికి బ్యాక్ బోన్ అని  ఆయన చెప్పారు.1931లో జనగణన ఆధారంగానే బీసీలను ఇప్పటికీ లెక్కిస్తున్నారని మంత్రి గుర్తు చేశారు.  90 ఏళ్లుగా బీసీల లెక్కలు దేశంలో లేవని ఆయన చెప్పారు. బీసీల జీవన స్థితిగతులను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి Gopala krishna  అభిప్రాయపడ్డారు.

ఏపీ Bc ల్లో 139 కులాలున్నాయని మంత్రి గుర్తు చేశారు. కుల గణన కచ్చితంగా జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న ఫీజు రీ ఎంబర్స్ మెంట్ పథకం  ఉన్నత చదువులకు వరంగా మారిందన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నామన్నారు. సీఎం ys jagan తీసుకొన్న నిర్ణయంతో బీసీలకు అనేక  రకాలుగా మేలు జరిగాయని చెప్పారు. వైఎస్ఆర్ చేయూత గొప్ప పథకమన్నారు.బీసీల ఆత్మగౌరవం దెబ్బతినేలా గత ప్రభుత్వం వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. బీసీల కోసం వైఎస్ఆర్ రెండు అడుగులు ముందుకు వేస్తే  వైఎస్ జగన్ పదడుగులు వేస్తున్నారన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios