విశాఖ రైల్వేజోన్ కు కట్టుబడి ఉన్నాం: కేంద్ర మంత్రి ఆశ్విని వైష్ణవ్
విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర మంత్రి ఆశ్విని వైష్ణవ్ ప్రకటించారు. రైల్వే జోన్ పై వదంతులను నమ్మవద్దని ఆయన కోరారు.
న్యూఢిల్లీ: విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర మంత్రి ఆశ్విని వైష్ణవ్ చెప్పారు.బుధవారం నాడు ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. విశాఖ రైల్వే జోన్ పై వదంతులను నమ్మవద్దని ఆయన కోరారు.విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ కూడా పూర్తైందని ఆయన చెప్పారు.
నిన్న న్యూఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోం శాఖ సమావేశం నిర్వహించింది.ఈ సమావేశంలో ఏపీ పునర్విభజన చట్టం 2014పై చర్చించారు. ఈ స మావేశం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. విశాఖలో రైల్వే జోన లేదని కేంద్ర అధికారులు ఈ సమావేశంలో చెప్పారని మీడియాలో కథనాలు వచ్చాయి.ఈ విషయమై ఆశ్విని వైష్ణవ్ స్పస్టత ఇచ్చారు. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రైల్వే జోన్ ఏర్పాటుకు నిర్మాణ వ్యయం అంచనా కూడా పూర్తైందన్నారు. భూసేకరణ కొంత పెండింగ్ లో ఉందన్నారు. దీని కారణంగానే పనులు కొంత ఆలస్యమౌతున్నాయని ఆయన మీడియాకు వివరించారు.అయితే రైల్వే జోన్ విషయమై చట్టంలో ఇచ్చిన హామీకి తాము కట్టుబడి ఉన్నామని మంత్రి ప్రకటించారు.
విశాఖపట్టణంలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని ఈ ఏడాది ఆగస్టు మాసంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు కేంద్ర మంత్రి ఆశ్విని వైష్ణవ్ ను కోరారు. ఈ విషయమై ఆయన సానుకూలంగా స్పందించారు.
ఏపీ పునర్విభజన చట్టం మేరకు విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. అయితే రైల్వే జోన్ ఏర్పాటు కోసం స్థానికులు గతంలో ఆందోళనలు నిర్వహించారు. టీడీపీలో ఉన్న సమయంలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ నిరహారదీక్షకు దిగిన విషయం తెలిసిందే. ఏపీ పునర్విభజన చట్టం మేరకు విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. అయితే రైల్వే జోన్ ఏర్పాటు కోసం స్థానికులు గతంలో ఆందోళనలు నిర్వహించారు. టీడీపీలో ఉన్న సమయంలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ నిరహారదీక్షకు చేశారు.
also read:విశాఖకు రైల్వే జోన్ రాకుంటే రాజీనామా.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన
రైల్వే జోన్ ఏర్పాటు విషయమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ వేడి రగులుతుంది. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు కాకపోతే తాను రాజీనామా చేస్తానని కూడా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ ప్రకటించారు. నిన్న జరిగిన సమావేశంలో రైల్వే జోన్ ఏర్పాటు అంశంపై అసలు చర్చే జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఇదే విషయమై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు కూడా ఇవాళ స్పందించారు. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు జరిగి తీరుతుందన్నారు. ఈ విషయంలో మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయన్నారు. ఈ విషయమై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.