గన్నవరం:  గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ మారినా  టీడీపీనే తమకు ముఖ్యమని కార్యకర్తలు, నేతలు తేల్చిచెప్పారు.

కృష్ణా జిల్లా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలతో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు గురువారం నాడు విజయవాడలో సమావేశమయ్యారు.

ఏటూ తేల్చుకోలేని స్థితిలో వల్లభనేని వంశీ: కేశినేని నాని ...

జిల్లాల పర్యటనలో భాగంగా టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ నేతలతో గురువారం నాడు సమీక్ష సమావేశాల్లో పాల్గొన్నారు. బుధవారం నుండి టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ నేతలతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు.

రెండో రోజు సమీక్ష సమావేశంలో భాగంగా గురువారం నాడు గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలతో చంద్రబాబునాయుడు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

జగన్ తో వల్లభనేని వంశీ భేటీ వెనక... టీడీపీ జిల్లా నాయకత్వంపై కార్యకర్తలు ఫైర్...

ఈ సమావేశానికి గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి ఈ నెల 27వ తేదీన రాజీనామా చేశారు. రాజకీయాలకు కూడ దూరంగా ఉంటానని ప్రకటించారు. వంశీ టీడీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది.

వల్లభనేని వంశీ ఎఫెక్ట్, అఖిలప్రియ భర్తపై కేసు: జగన్ పై చంద్రబాబు భగ్గు...

నవంబర్ మొదటి వారంలో వల్లభనేని వంశీ టీడీపీని వీడి వైసీపీలో చేరే ఛాన్స్ ఉందని సమాచారం. ఈ తరుణంలో గన్నవరం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలతో చంద్రబాబునాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు.వంశీ ఎటు వెళ్లినా కానీ, తమకు మాత్రం టీడీపీ ముఖ్యమని చంద్రబాబుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు తేల్చి చెప్పారు.