Asianet News TeluguAsianet News Telugu

ఎగువన భారీ వర్షాలు: శ్రీశైలంలోకి భారీగా వరద నీరు

ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుకుంటోంది. జూరాల ప్రాజెక్ట్ దిగువకు 2,10,000 క్యూసెక్కుల వరద నీరు విడుదలవ్వడంతో.. శ్రీశైలం జలాశయానికి 1,75,656 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.

water flow in Srisailam project
Author
Srisailam, First Published Aug 2, 2019, 11:42 AM IST

ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుకుంటోంది. జూరాల ప్రాజెక్ట్ దిగువకు 2,10,000 క్యూసెక్కుల వరద నీరు విడుదలవ్వడంతో.. శ్రీశైలం జలాశయానికి 1,75,656 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.

ఎగువ నుంచి వరద ఎక్కువగా వచ్చి చేరుతుండటంతో దిగువకు ప్రవాహం పెరుగుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 832.30 అడుగులుగా ఉంది. రిజర్వాయర్ పూర్తిస్థాయి సామర్ధ్యం 215.80 టీఎంసీలుకాగా.. మూడు రోజుల కిందట ప్రారంభమైన వరదతో 51.96 టీఎంసీల నీటి నిల్వ నమోదైంది.

Follow Us:
Download App:
  • android
  • ios