తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కాకినాడ వాచ్‌మెన్ రాము హత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. సహజీవనం చేస్తున్న మహిళ, ఆమె కుటుంబసభ్యులే అతనిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.

తనను వేధిస్తూ పిల్లల్ని చంపుతానని బెదిరించడంతో రాముకి బుద్ధి చెప్పాలని అనుకున్నానని దీనిలో భాగంగా కాళ్లు, చేతులు విరగ్గొట్టాలని యత్నించామంది. అయితే తలకు గట్టి దెబ్బ తగలడంతో చనిపోయినట్లు నిందితురాలు తెలిపింది.

ఈ ఘటన కాకినాడలోని ప్రతాప్ నగర్ 43వ వార్డులోని విశ్వనాధ్ మార్గ్‌లో జరిగింది. పిఠాపురానికి చెందిన రాము సెక్యూరిటీ గార్డ్‌గా పని చేయడానికి రాము కాకినాడకు వచ్చినట్టు తెలుస్తోంది.