మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ, నారా లోకేష్ ను పప్పు అంటే ఏంటి తప్పని ప్రశ్నించారు. పైగా ఈ విషయంలో ప్రభుత్వమే అతిగా స్పందిస్తోందని కూడా వ్యాఖ్యానించారు.

నారా లోకేష్ను పప్పు అనటంలో తప్పే లేదని ఉండవల్లి బల్లగుద్ది మరీ చెబుతున్నారు. సోషల్ మీడియాలో లోకేష్ గురించి పప్పు అనే వస్తోంది. చివరకు ఇది ఎలా తయారైందంటే, లోకేష్ ను ఒకనాటికి లోకేష్ అనే బదులు పప్పు అని అంటేనే గుర్తుపడతారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయ్. జనాల్లో పాటు సోషల్ మీడియాలో కూడా నెటిజన్ల మధ్య లోకేష్ పేరుపై అంతలా చర్చ జరుగుతోంది. ఇదే విషయమై ఈరోజు రాజమండ్రి మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ, నారా లోకేష్ ను పప్పు అంటే ఏంటి తప్పని ప్రశ్నించారు. పైగా ఈ విషయంలో ప్రభుత్వమే అతిగా స్పందిస్తోందని కూడా వ్యాఖ్యానించారు. అనేక అంశాలపై ప్రభుత్వానికి తాను రాసిన లేఖలపై స్పందనే లేదన్నారు.

పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఉండవల్లి డిమాండ్ చేసారు. 2018 నాటికి గ్రావిటి ద్వారా త్రాగునీరు వస్తుందని ప్రభుత్వం చెబుతున్నది నిజమే అయితే, ఓట్లన్నీ ప్రభుత్వానికే పడతాయని కూడా సవాలు విసిరారు. కాఫర్ డ్యాం ద్వారా నీటిని ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా అసలు కాఫర్ డ్యాం ఎక్కడుందని కొత్త ప్రశ్న లేవనెత్తారు. దేశమంతా ఒకేసారి ఎన్నికల విధానం సాధ్యం కాదంటూ కొట్టి పడేసారు.