ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం లో దారుణం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పం తహశీల్దార్ కార్యాలయంలో మహిళా అటెండర్ లైంగిక వేధింపులకు గరయ్యింది. తహశీల్దార్ కార్యాలయంలో పనిచేసే మహిళా అటెండర్ పట్ల వీఆర్ఏ ఆనంద్ దారుణంగా ప్రవర్తించాడు.

ఆ అటెండర్ ఫోటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు. తన లైంగిక వాంఛ తీర్చకుంటే ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానంటూ బెదిరించాడు. కాగా.. అతని వేధింపులు తట్టుకోలేక అటెండర్ భవ్య పోలీసులను ఆశ్రయించింది. అయితే.. పోలీసులకు ఫిర్యాదు చేసినా.. అతనిపై చర్యలు తీసుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది.

ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే ఇలాంటి దారుణం జరగడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. కాగా.. ఈ ఘటనపై విపక్షాలు మండిపడుతున్నాయి.