నంద్యాల ఓటర్లలో ఓటు హక్కు వినియొగంపై ఉత్సాహం కనబడుతోంది. ప్రధానంగా మహిళలు, యువతలో ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. నియోజకవర్గంలోని గోస్పాడు, నంద్యాల రూరల్ తో పాటు మున్సిపాలిటీ పరిధిలోని అన్నీ వార్డుల్లోనూ ఓటింగ్ సక్రమంగా జరిగేందుకు ఎన్నికల కమీషన్ పక్కా ఏర్పాట్లు చేసింది.

నంద్యాలలో పోలింగ్ మొదలై ప్రశాంతంగా సాగుతోంది. పట్టణంలోని సంజీవనగర్ బూత్ నెంబర్ 81లో వైసీపీ అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డి, కుటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం మీద నంద్యాల ఓటర్లలో ఓటు హక్కు వినియొగంపై ఉత్సాహం కనబడుతోంది. ప్రధానంగా మహిళలు, యువతలో ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనబడుతోంది.

నియోజకవర్గంలోని గోస్పాడు, నంద్యాల రూరల్ తో పాటు మున్సిపాలిటీ పరిధిలోని అన్నీ వార్డుల్లోనూ ఓటింగ్ సక్రమంగా జరిగేందుకు ఎన్నికల కమీషన్ పక్కా ఏర్పాట్లు చేసింది. 2.19 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 7 గంటలకే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు పెద్దఎత్తున చేరుకుంటున్నారు. సాయంత్రం 6 గంటల వరకూ ఓటింగ్ కొనసాగుతుంది.