Asianet News TeluguAsianet News Telugu

మహిళా వాలంటీర్ల వేధింపులు... ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య

మహిళా వాలంటీర్ల వేధింపులు తాళలేక ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదం నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

volunteers harassment... man suicide in nellore akp
Author
Nellore, First Published Jul 13, 2021, 12:09 PM IST

నెల్లూరు: మహిళా వాలంటీర్ల వేధింపులు తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఇలా ఓ వ్యక్తి మరణానికి కారణమైన ఇద్దరు మహిళా వాలంటీర్లు కటకటాలపాలయ్యారు. 

వివరాల్లోకి వెళితే... నెల్లూరు జిల్లా నక్కా గోపాల్ నగర్ లో నిరీష, అనిత వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యతాయుతమైన ఉద్యోగాన్ని చేస్తున్న వీరు ప్రజలపై వేధింపులకు దిగారు. ఇలా శ్రీను(35) అనే వ్యక్తి భార్యను కూడా కొన్నాళ్లుగా వేధిస్తున్నారు. భార్యపై వీరు చేస్తున్న వేధింపులను ఆపలేక నిస్సహాయ స్థితిలో వున్నానని శ్రీని తీవ్రంగా మధనపడేవాడు. ఈ క్రమంలోనే ఇటీవల భార్యపై వాలంటీర్ల వేధింపులు మరీ ఎక్కువ అవడంతో శ్రీను తట్టుకోలేకపోయాడు.  

read more  భార్య అంత్యక్రియలు జరిగినచోటే... ఇద్దరు పిల్లలతో భర్త ఆత్మహత్య

మహిళా వాలంటీర్ల వేధింపులను అవమానంగా భావించిన శ్రీను దారుణ నిర్ణయం తీసుకున్నాడు.  ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహానికి స్వాధీనం చేసుకున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వాలంటీర్లు  శీరీష, అనితను అదుపులోకి తీసుకున్నారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios