విజయనగరం: డిగ్రీ విద్యార్ధినిని కాళ్లు, చేతులు కట్టేసిన ఘనటలో పోలీసులు వాస్తవాలను వెలికితీశారు. విద్యార్ధిని చెప్పింది కట్టు కథగా పోలీసులు తేల్చారు. 

విజయనగరం జిల్లా ఎస్పీ ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను మీడియాకు వివరించింది.విజయనగరం జిల్లాలోని గుర్ల వద్ద డిగ్రీ విద్యార్ధిని కాళ్లు, చేతులు కట్టేసి తుప్పల్లో కన్పించింది. ఈ కేసును అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేశారు. 

గత నెల 27వ తేదీన బాబాయ్ వద్దకు వెళ్తానని చెప్పి హాస్టల్ లో పర్మిషన్ తీసుకొని తనకు తెలిసిన స్నేహితుడిని కలిసేందుకు ఆమె బయటకు వెళ్లింది. అదే సమయంలో హాస్టల్ కు ఆమె సోదరుడు హాస్టల్ కు వచ్చాడు. ఆమె గురించి అడిగారు.

ఈ విషయం ఆమెకు తెలిసింది. స్నేహితుడిని కలిసి హాస్టల్ కు తిరిగి వెళ్లేందుకు పాలకొల్లు నుండి పాలకొండ వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు ఎక్కింది. గుర్ల దాటిన తర్వాత  బస్సు దిగిన ఆమె రోడ్డు పక్కనే ఉన్న తుప్పల్లోకి వెళ్లి తనకు తానే కాళ్లు, చేతులను చున్నీతో కట్టుకొని అపస్మారకస్థితిలోకి వెళ్లినట్టుగా నటించింది.

ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కోమాలో ఉన్నట్టుగా నటించిన విద్యార్ధిని కోలుకొన్నాక పోలీసులు  ఆమెను  విచారించి కీలక విషయాలను తెలుసుకొన్నారు.

హాస్టల్ ను వీడి తాను స్నేహితుడిని కలిసేందుకు వెళ్లిన విషయం ఇంట్లో తెలుస్తోందనే భయంతో ఈ నాటకానికి విద్యార్ధిని తెరతీసిందని ఎస్పీ తెలిపారు. 48 గంటల్లోనే ఈ కేసు విచారణను కొలిక్కి తీసుకొచ్చామని ఎస్పీ చెప్పారు. ఈ కేసులో వాస్తవాలను వెలికితీసిన పోలీసు అధికారులను ఎస్పీ అభినందించారు. 

ఈ డ్రామా నడిపిన  విద్యార్ధినిది తెర్లాం మండలం లోచర్ల గ్రామంగా ఎస్పీ తెలిపారు. హైద్రాబాద్ కు చెందిన బీ. ఫార్మసీ విద్యార్ధిని అత్యాచారం నాటకం ఆడింది. గత మాసంలోనే ఆమె అనుమానాస్పదస్థితిలో మరణించారు. 

కర్ణాటక రాష్ట్రంలో టెన్త్ క్లాస్ విద్యార్ధిని హోం వర్క్ చేయకుండా అత్యాచారం జరిగిందని నాటకం ఆడిన విషయం తెలిసిందే.తాజాగా విజయనగరం జిల్లాలో చోటు చేసుకొన్న ఘటనలో వాస్తవాలను పోలీసులు తేల్చారు.