Asianet News TeluguAsianet News Telugu

తల్లితో వివాహేతర సంబంధం.. కూతురి మీద కన్ను... అడ్డుగా ఉన్నాడని కొడుకుని...

పవన్ కుమార్ తండ్రి చనిపోయాడు. ఈ క్రమంలో తల్లి లతకు పద్మనాభ మండలం చిన్నాపురానికి చెందిన గిడిజాల జగదీష్ తో వివాహేతర సంబంధం ఉంది. దీనిపై పవన్ పలుమార్లు తల్లిని మందలించాడు.  జగదీష్ ని సైతం హెచ్చరించినా వినకుండా వారి బంధం కొనసాగుతోంది.

Vizianagaram police crack mystery behind teen's murder, arrest 5
Author
Hyderabad, First Published Aug 7, 2021, 4:25 PM IST

విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ లో మూడు నెలల కిందట నమోదైన అదృశ్యం కేసును పోలీసులు చేధించారు. సారిక గ్రామానికి చెందిన బొద్దూరు పవన్ కుమార్ (17) అదృశ్యం కేసులో సంచలన విషయాలు తేలాయి. అతడు హత్యకు గురయ్యాడని తేలింది. ఈ హత్యలో పాల్గొన్న ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. కేసు వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో పట్టణ డి.ఎస్.పిఅనిల్ కుమార్ తెలిపారు.

తన కుమారుడు పవన్ కుమార్ మే 8వ తేదీన సాయంత్రం పాల ప్యాకెట్లు తెచ్చేందుకు ఇంటి నుంచి బయటికి వెళ్లి, తిరిగి రాలేదని మే 9న తల్లి లత పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదృశ్యం కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే జూలై 27 వ తేదీన సారిక గ్రామానికి దగ్గరలో ఉన్న వ్యవసాయ బావిలో ఓ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహం పవన్‌దిగా నిర్ధారించి దర్యాప్తు చేయగా పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

పవన్ కుమార్ తండ్రి చనిపోయాడు. ఈ క్రమంలో తల్లి లతకు పద్మనాభ మండలం చిన్నాపురానికి చెందిన గిడిజాల జగదీష్ తో వివాహేతర సంబంధం ఉంది. దీనిపై పవన్ పలుమార్లు తల్లిని మందలించాడు.  జగదీష్ ని సైతం హెచ్చరించినా వినకుండా వారి బంధం కొనసాగుతోంది.

ఇదిలా ఉండగా.. సారిక గ్రామానికి చెందిన వాలిపల్లి సురేష్ (33)తో పవన్ కు మంచి స్నేహం ఉంది. సురేష్ కన్ను పవన్‌ చెల్లిపై పడింది. ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని తెలిపాడు. దీనికి పవన్ తో పాటు పవన్ తల్లి నిరాకరించింది. పాఠశాలకు వెళ్తున్న చిన్నపిల్ల కావాల్సి వచ్చిందా అంటూ మందలించారు. ఆ అమ్మాయి మీద ప్రేమతో సురేష్ లత తో వివాహేతర సంబంధం ఉన్న జగదీష్ ను సంప్రదించాడు.

ఇద్దరూ ఏకమై పవన్ ని చంపితే తమ లక్ష్యాలు నెరవేరుతాయని భావించారు. పవన్ హత్యకు తన వద్ద పనిచేస్తున్నసువ్వాడ శంకర్రావును సురేష్ సాయం కోరాడు. ట్రాక్టర్ డ్రైవర్ పిట్టా శంకర్, మరో స్నేహితుడు మేకల సోములు సాయంతో హత్యకు పథకం సిద్ధం చేశాడు.

అయితే మే 8వ తేదీన పవన్ కు డబ్బులు అవసరమై సురేష్ను 2000 అప్పు అడిగాడు. సురేష్ వెయ్యి రూపాయలు ఇచ్చి, మిగతా వెయ్యి సాయంత్రం ఇస్తానని చెప్పాడు. ఈ విషయాన్ని శంకర్ కి సురేష్ చెప్పగా.. ఇదే అదను అని సారిక గ్రామ సమీపంలో కల్లు తాగే ప్రదేశం వద్ద మేకల సోములు, పిట్టా శంకర్ లను తాళ్లు, ప్లాస్టిక్ గోనెసంచి తో పవన్ ను హతమార్చేందుకు సిద్ధంగా ఉంచారు.

 సాయంత్రం కావడంతో సురేష్ వెయ్యి రూపాయల కోసం పవన్ ఫోన్ చేయగా సురేష్ సువాడ శంకర్ తో కలిసి ముగ్గురు ఒకే వాహనంపై కల్లు తాగే ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటికే కాపు కాస్తున్న సువ్వాడ శంకర్ బైక్ దిగుతుండగానే కర్రతో పవన్ పై దాడి చేశాడు. దీంతో పవన్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు.

మృతదేహాన్ని కనిపించకుండా సోములు, పిట్టా శంకర్ గోనె సంచిలో మూటగట్టి సమీపంలోని వ్యవసాయ బావిలో పడేశారు. బైక్ ను కూడా తాళ్లతో కట్టి బావిలో పడేశారు. అయితే పవన్ ఇంటికి రాకపోవడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అదృశ్యం కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 ఈ క్రమంలోనే కొన్ని క్లూ లతో హంతకులు వాలిపల్లి సురేష్, సువ్వాడ శంకర్ రావు, మేకల సోములు, పిట్టాశంకర్, గిడిజాల జగదీశ్‌ చిక్కారు. వారిని అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. కేసు ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన రూరల్ సీఐ మంగవేణి, ఎస్ఐలు నారాయణరావు, అశోక్ కుమార్, గంట్యాడ ఎస్‌ఐ కిరణ్‌ కుమార్‌నాయుడు, సీసీఎస్‌ ఎస్‌ఐ ప్రశాంత్‌ కుమార్, ఏఎస్‌ఐ త్రినాథరావు, హెచ్‌సీలు శ్యామ్‌బాబు, రామారావు, సిబ్బంది షేక్ షఫీ, కోటేశ్వరరావు, రమణ, స్థాయిలను డిఎస్పీ అభినందించారు. వారికి నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు 

Follow Us:
Download App:
  • android
  • ios