విశాఖలో ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడ్డ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమెకు కేజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నారు.

కాగా, నగరంలోని థామ్సన్‌ వీధికి చెందిన ప్రియాంక, శ్రీకాంత్‌లు ఏడాదికాలంగా స్నేహంగా ఉంటున్నారు. ఈ క్రమంలో శ్రీకాంత్ ప్రవర్తనపై ప్రియాంక తల్లిదండ్రులకు అనుమానం రావడంతో అతడికి దూరంగా ఉండాలని కూతురిని హెచ్చరించారు.

దాంతో ఆమె శ్రీకాంత్‌తో దూరంగా ఉంటూ వస్తోంది. ఈ దశలో శ్రీకాంత్ ఆమెపై కక్షగట్టి పథకం ప్రకారం బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రియాంకపై దాడికి పాల్పడ్డాడు.

మంచం కింద దాక్కొని గొంతు కోసేశాడు. అనంతరం అతను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో వీరిద్దరిని ప్రియాంక కుటుంబసభ్యులు కేజీహెచ్‌కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.