అమిత్ షాపై చంద్రబాబు డైరెక్షన్ లోనే దాడి: విష్ణుకుమార్ రాజు

Vishnukumar Raju blames Chnadrababu
Highlights

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి డైరెక్షన్ లోనే అలిపిరి వద్ద తమ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాపై దాడి జరిగిందని బిజెపి నెత విష్ణుకుమార్ రాజు ఆరోపించారు.

విశాఖపట్నం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి డైరెక్షన్ లోనే అలిపిరి వద్ద తమ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాపై దాడి జరిగిందని బిజెపి నెత విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. టీడీపి కార్యకర్తాలు కావాలనే దాడి చేశారా, సిఎం డైరెక్షన్ లో చేశారా అనేది తేలాల్సి ఉందని అన్నారు. 

అమిత్ షాకు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆయన విమర్శించారు. టీడీపి కార్యకర్తలు గుండాల్లా వ్యవహరించారని అన్నారు. సాయంత్రంలోగా విచారణ జరిపించి, దాడిచేసినవారిని జైల్లో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. 

టీడీపి కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ పరువు తీశారని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపి అవినీతిలో మాత్రమే కూరుకుపోయిందని అనుకుంటున్నామని, ఇప్పుడు గూండాయిజంలో కూడా కూరుకుపోయినట్లు అనిపిస్తోందని అన్నారు.  ముందస్తు ప్రణాళిక ప్రకారమే అమిత్ షాపై దాడి జరిగిందని అన్నారు. తిరుపతికి వచ్చే వారిని అతిథులుగా చూడాలని ఆయన అన్నారు. దేశం మొత్తం ఎపిని చీదరించుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు.

తిరుపతిలో బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా కాన్వాయ్‌ దాడి నీచమైన రాజకీయాలకు పరాకాష్ట అని బీజేపీ నేత కేవీ లక్ష్మీపతి రాజా అన్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దాడులు చేసిన వారిపై నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేయాలని అన్నారు.

అమిత్ షా దాడిని తమ పార్టీ తీవ్రంగా పరిగణిస్తుందని బిజెపి నేత ఆకుల సత్యనారాయణ అన్నారు. దాడిని ఖండిస్తున్నట్లు ఆయనతె సిపారు. వ్యక్తిగత దాడితో టీడీపి ఏం చెప్పాలని అనుకుంటోందని ఆయన ప్రశ్నించారు. 

నిరసనను దాడిగా చూడడం సరికాదని, తెలుగు ప్రజలు ఎంత అసంతృప్తిగా ఉన్నారో అర్తం చేసుకోవాలని సిపిఐ నేత నారాయణ అన్నారు. 

loader