విశాఖ పరిపాలన రాజధానిగా ఎప్పుడైనా కావొచ్చు: ఏపీ ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి
పరిపాలన రాజధానిగా విశాఖపట్టణం ఎప్పుడైనా కావొచ్చని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.
తిరుపతి: పరిపాలన రాజధానిగా విశాఖ ఎప్పుడైనా అవ్వొచ్చని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. బుధవారంనాడు ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. సంక్షేమం, అభివృద్ది మహా
యజ్ఞంలా రాష్ట్రంలో కొనసాగుతుందన్నారు. కొన్ని విషశక్తులు, రాక్షస మూకలు , మారీచులు రాష్ట్రంలో అభివృద్దికి అడ్డుపడుతున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రాన్ని ఇబ్బంది పాలుజేసేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని పరోక్షంగా విపక్షాలపై సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపణలు చేశారు. కుట్రలకు, కుయుక్తులకు ధీటుగా స్పందించే శక్తి ఇవ్వాలని దేవుడిని ప్రార్ధించినట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశాన్ని తెరమీదికి తెచ్చింది. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధాని, కర్నూల్ ను న్యాయ రాజధాని, అమరావతిని శాసనస రాజధానిగా ఏర్పాటు చేయేనున్నట్టుగా ప్రకటించారు. అయితే అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని అమరావతి రైతులు కోరుతున్నారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని విపక్షాలు కోరుతున్నాయి.
2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ అమరావతిని రాజధానిగా ప్రకటించింది. ఈ సమయంలో వైసీపీ కూడా అమరావతి రాజధానిని ఒప్పుకుందని టీడీపీ సహా ఇతర పార్టీలు గుర్తు చేస్తున్నాయి. అభివృద్దిని టీడీపీ ప్రభుత్వం కేంద్రీకృతం చేసిందని వైసీపీ ఆరోపించింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ది చేయాలనే ఉద్దేశ్యంతోనే మూడు రాజధానుల అంశాన్ని తెరమీదికి తీసుకువచ్చినట్టుగా వైసీపీ సర్కార్ చెబుతుంది.అమరావతి రాజధాని అంశంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో జగన్ సర్కార్ సవాల్ చేసింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.
మూడు రాజధానులను ఎట్టి పరసి్తుల్లోనైనా ఏర్పాటు చేసి తీరుతామని వైసీపీ నేతలు చెబుతున్నారు.విశాఖపట్టణంలో ఎగ్జిక్యూటివ్ రాజధానిని ఎవరు అడ్డొచ్చినా ఏర్పాటు చేస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు. మూడు రాజధానులకు అనుకూలంగా వైసీపీ నేతలు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు .జేఏసీలు నిర్వహించిన సభలకు వైసీపీ మద్దతు ఇచ్చింది.
also read:రైతులతో ఒప్పందంలో రాజధాని అని ఎక్కడుంది?: ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ
మూడు రాజధానులను ఎట్టి పరసి్తుల్లోనైనా ఏర్పాటు చేసి తీరుతామని వైసీపీ నేతలు చెబుతున్నారు.విశాఖపట్టణంలో ఎగ్జిక్యూటివ్ రాజధానిని ఎవరు అడ్డొచ్చినా ఏర్పాటు చేస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు. మూడు రాజధానులకు అనుకూలంగా వైసీపీ నేతలు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు .జేఏసీలు నిర్వహించిన సభలకు వైసీపీ మద్దతు ఇచ్చింది.