Asianet News TeluguAsianet News Telugu

విశాఖ చిన్నారి సింధుశ్రీ కేసు: తల్లి ప్రియుడే హంతకుడు, విచారణలో సంచలన విషయాలు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విశాఖ చిన్నారి సింధుశ్రీ హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. పాపను కర్రతో కొట్టి చంపి అనారోగ్యంతో మృతిచెందినట్లు చిత్రీకరించారని పోలీసులు తెలిపారు. చంపేసి రాత్రికి రాత్రి అంత్యక్రియలు నిర్వహించారని వెల్లడించారు. 

visakhapatnam three year old girl sindhu sree case updates ksp
Author
Visakhapatnam, First Published Jun 5, 2021, 5:59 PM IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విశాఖ చిన్నారి సింధుశ్రీ హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. పాపను కర్రతో కొట్టి చంపి అనారోగ్యంతో మృతిచెందినట్లు చిత్రీకరించారని పోలీసులు తెలిపారు. చంపేసి రాత్రికి రాత్రి అంత్యక్రియలు నిర్వహించారని వెల్లడించారు. అయితే సింధుశ్రీని జగదీశే హత్య చేసినట్లు పేర్కొన్నారు. అతనిపై కేసు నమోదు చేశామని వెల్లడించారు. హత్య జరిగినప్పుడు అక్కడ సింధుశ్రీ తల్లి వరలక్ష్మీ లేదని పోలీసులు తెలిపారు. 

Also Read:వివాహేతర బంధానికి అడ్డుగావుందని... కన్న కూతురిని హతమార్చిన కసాయి తల్లి

కాగా, వరలక్ష్మి అనే వివాహిత కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటూ బోర జగదీశ్ రెడ్డి అనే మరో వ్యక్తితో సహ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలోనే తన అక్రమ సంబంధానికి అడ్డుగా వుందని కన్న కూతురిని హతమార్చినట్లు వార్తలు వచ్చాయి. సొంత కూతురిని హత్య చేసినట్లు తెలియగానే స్థానికులు తీవ్ర ఆగ్రహంతో వరలక్ష్మిపై దాడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో స్థానికులకు పోలీసులకు తోపులాట జరిగింది. దీంతో ఆగ్రహించిన స్థానికులు పోలీస్ జీపులను ధ్వంసం చేశారు. చివరకు పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని నిందితురాలిని అక్కడి నుండి తరలించారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు జగదీశ్‌ను నిందితుడిగా నిర్ధారించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios