Asianet News TeluguAsianet News Telugu

విశాఖలో ప్రధాని పర్యటన వేళ.. స్టీల్ ప్లాంట్ కార్మికులు నిరసన.. అదుపులోకి తీసుకున్న పోలీసులు..

విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ కార్మికులు, లెఫ్ట్ పార్టీ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. మోదీకి వ్యతిరేకంగా నినాదాలు  చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలంటూ డిమాండ్ చేశారు.

visakhapatnam steel plant employees protest against pm modi tour
Author
First Published Nov 12, 2022, 11:58 AM IST

విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన వే స్టీల్ ప్లాంట్ కార్మికులు, లెఫ్ట్ పార్టీ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలకు వ్యతిరేకంగా ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ.. ప్రధాని పర్యటన సందర్భంగా నిరసనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా శనివారం ప్లాంట్ గేటు వద్ద సభతోపాటు పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మోదీకి వ్యతిరేకంగా నినాదాలు  చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 


ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంగణానికికి వెళ్ళడానికి ప్రయత్నించిన కార్మికులు, వామపక్ష నేతలను కృష్ణ కాలేజీ జంక్షన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ చేయబోమని మోదీ ప్రకటన చేయాలని స్టీల్ ప్లాంట్ కార్మికులు, లెఫ్ట్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios