200 రోజులకి చేరిన ఉక్కు ఉద్యమం: విశాఖలో 10 కి.మీ మేర మానవహారం
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మిక సంఘాల జేఎసీ ఆధ్వర్యంలో కార్మికులు చేపట్టిన ఆందోళన ఆదివారం నాటికి 200 రోజులకి చేరుకొంది. ప్రభుత్వానికి తమ డిమాండ్ ను తెలిపేందుకు గాను కార్మికులు 10 కి.మీ మేర మానవహారం ఏర్పాటు చేశారు.
విశాఖపట్టణం:విశాఖస్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మికులు చేపట్టిన ఆందోళనలు ఆదివారంనాటికి 200 రోజులకు చేరుకొన్నాయి. ఈ సందర్భంగా కార్మికులు భారీ మానవహారంగా ఏర్పడ్డారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మిక సంఘాల జేఎసీ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళనలు ఇవాళ్టికి 200 రోజుకి చేరుకొన్నాయి. ఆగనంపూడి నుండి లక్కిరెడ్డి పాలెం వరకు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో భారీ మానవహారం ఏర్పాటు చేశారు. కార్మికుల మానవహారంలో గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సహా పలువురు విపక్ష పార్టీల నేతలు కూడా ఈ మానవహారంలో పాల్గొన్నారు.
విశాఖపట్టణంలోని 10 కి.మీ దూరం మేరకు కార్మికులు మానవహారంగా ఏర్పడి తమ డిమాండ్ ను తెలిపారు. ఈ మానవహారం కారణంగా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ ను మళ్లించారు పోలీసులు. ప్రత్యామ్నాయమార్గాల్లో ప్రయాణీకులను తరలిస్తున్నారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. బీజేపీ, వైసీపీలతో సహా ఇతర ప్రధాన పార్టీలన్నీ కూడ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తున్నాయి.