మత్తు పదార్ధాలకు  అలవాటు పడిన  వ్యక్తులు  విశాఖపట్టణంలో  వీరంగం సృష్టించారు.  దంపతులపై దాడికి దిగారు.  వివాహిత దుస్తులు  చింపారు. ఈ ఘటనపై  పోలీసులు  కేసు నమోదు  చేశారు. 

విశాఖపట్టణం: విశాఖపట్టణంలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. షాపింగ్‌కి వచ్చిన దంపతులపై దాడికి దిగారు. వివాహిత దుస్తులను గంజాయి బ్యాచ్ చించివేసింది. అడ్డుపడిన మహిళ భర్త, సోదరుడిపై కూడా గంజాయి బ్యాచ్ దాడికి దిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.