నేను ఎవరి స్థలం ఆక్రమించలేదు: ఎస్పీ మధు ఆరోపణలపై విశాఖ ఎంపీ సత్యనారాయణ


ఇంటలిజెన్స్ ఎస్పీ మధు స్థలాన్ని తాను ఆక్రమించుకొనే ప్రయత్నం చేసినట్టుగా మీడియాలో వచ్చిన వార్తలను విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఖండించారు. రోడ్డు మధ్యలోనే ఈ స్థలం ఉందన్నారు. ఇప్పటి వరకు ఈ ప్రాంతమంతా రోడ్డే అనుకొన్నామని ఎంపీ చెప్పారు.

Visakhapatnam MP MVV Satyanarayana reacts on inteligence SP Madhu comments over land issue

విశాఖపట్టణం: ఇంటలిజెన్స్ ఎస్పీ Madhuకు చెందిన స్థలాన్ని తాను కబ్జా చేయలేదని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ స్పష్టం చేశారు.  మంగళవారం నాడు విశాఖ ఎంపీ MVV Satyanarayana మీడియాతో మాట్లాడారు. తాను ఎవరి భూమిని కబ్జా చేయలేదన్నారు. Visakhapatnam MP చెందిన వెంచర్స్ పై intelligence ఎస్పీ మధు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై  ఎంపీ సత్యనారాయణ వివరణ ఇచ్చారు.

ఎస్పీ మధుతో పాటు మరో నలుగురు కలిసి 500 గజాల స్థలాన్ని  ఎల్లపు ఈశ్వర్ వద్ద కొనుగోలు చేశారన్నారు. అయితే ఈ స్థలంలో కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం ఎస్పీ ప్రయత్నిస్తున్న విషయాన్ని తనకు కొందరు సమాచారం ఇచ్చారన్నారు. అయితే ఈ విషయమై తాను పోలీసులకు, మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసిన మాట వాస్తవమేనన్నారు. 

తన స్థలంలో గోడ నిర్మించుకొంటుంటే అడ్డుకొన్నారని తాను చెప్పానని ఎస్పీ మధు  చెప్పారన్నారు. కానీ  ఓ వర్గం మీడియాలో మాత్రం ఎంపీ  ఈ భూమిని ఆక్రమించుకొంటున్నారని తప్పుడు ప్రచారం చేశారన్నారు.  స్వంత స్థలంలోనైనా ఏదైనా అనుమతులు వచ్చిన తర్వాతే నిర్మాణాలు చేయాలన్నారు.. కానీ ఎస్పీకి చెందిన భూమిలో కూడా అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపట్టారని ఎంపీ వివరించారు.

ప్రభుత్వ నిబంధనలను తాము కానీ, తమ సంస్థ కానీ ఉల్లంఘించలేదని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ స్పష్టం చేశారు. ఎస్పీ మధుకు ఈ భూమిని విక్రయించిన వ్యక్తి ఆయనను మోసం చేశారని విశాఖ ఎంపీ చెప్పారు. మధు కొనుగోలు చేసిన 500 గజాల స్థలంలో 300 గజాల భూమి వివాదంలో ఉందన్నారు. 150 గజాలకు ఎలాంటి ఇబ్బంది లేదని Revenue అధికారులు క్లియరెన్స్ ఇచ్చారని ఎంపీ వివరించారు. 

అయితే ఎస్పీ మధు తన స్థలంలో గోడ నిర్మాణానికి సంబంధించి తమకు అభ్యంతరం లేదన్నారు. అయితే అర్ధరాత్రి గోడ నిర్మించేందుకు పూనుకోవడంతో పాటు అనుమతి లేకుండా గోడ నిర్మిస్తున్నారని తాను నిలిపివేయాలని అధికారులను కోరానని ఎంపీ సత్యనారాయణ తెలిపారు. ఈ గోడ నిర్మించేంత వరకు  ఈ స్థలం ఎస్పీ  మధుది అనే విషయం తమకు తెలియదన్నారు. లేఔట్‌లో కూడా ఈ ప్రాంతాన్ని రోడ్డుగానే చూపారని ఎంపీ వివరించారు.రోడ్డు మధ్యలో ఎస్పీ స్థలం ఉందని ఎంపీ చెప్పారు. అయితే ఇదంతా రోడ్డే అనుకొన్నామన్నారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios