డాక్టర్ సుధాకర్ న్యూసెన్స్ చేస్తున్నారు, వెనుక రాజకీయ నేతలు: విశాఖ సీపీ
డాక్టర్ సుధాకర్ పదే పదే న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని విశాఖపట్టణం సీపీ రాజీవ్ కుమార్ మీనా (ఆర్కే మీనా) చెప్పారు. ఇవాళ విశాఖపట్టణం 4వ, తరగతి పోలీస్ స్టేషన్ వద్దకు డాక్టర్ సుధాకర్ వచ్చి ఉద్యోగం కావాలంటున్నారన్నారు.
విశాఖపట్టణం: డాక్టర్ సుధాకర్ పదే పదే న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని విశాఖపట్టణం సీపీ రాజీవ్ కుమార్ మీనా (ఆర్కే మీనా) చెప్పారు. ఇవాళ విశాఖపట్టణం 4వ, తరగతి పోలీస్ స్టేషన్ వద్దకు డాక్టర్ సుధాకర్ వచ్చి ఉద్యోగం కావాలంటున్నారన్నారు.
గురువారం నాడు డాక్టర్ సుధాకర్ నాలుగో తరగతి పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చాడు. పోలీసులు ఉద్యోగం ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగం కావాలంటే ప్రభుత్వాన్ని అడగాలని ఆయన సూచించారు.
సీబీఐ విచారణ చేస్తున్న కేసు విషయంలో పోలీసు స్టేషన్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఏదైనా చెప్పుకోవాలంటే సీబీఐకి చెప్పుకోవాలని ఆయన సూచించారు.
also read:పిచ్చివాడిగా ముద్రవేసి చంపాలనుకొన్నారు: డాక్టర్ సుధాకర్ సంచలనం
సుధాకర్ న్యూసెన్స్ వ్యవహరం వెనుక కొందరు వ్యక్తుల ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. కొందరు రాజకీయ నాయకులు వెనుక ఉండి ఇదంతా నడిపిస్తున్నారని ఆయన ఆరోపించారు.ఈ వ్యవహరాలను సీబీఐ దృష్టికి తీసుకెళ్తానని ఆయన చెప్పారు.
ఏటీఎం కార్డు తన కారులో ఉందని, ఈ విషయమై పోలీసులతో మాట్లాడేందుకు పోలీస్ స్టేషన్ కు వచ్చినట్టుగా డాక్టర్ సుధాకర్ ఓ తెలుగు న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ ఇంటర్వ్యూలో సంచలన ఆరోపణలు చేశాడు.
పిచ్చివాడిగా ముద్రవేసి తననుచంపాలనుకొన్నారని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలు చేసిన కొద్దిసేపటికే విశాఖపట్టణం సీపీ మీనా స్పందించారు.