Asianet News TeluguAsianet News Telugu

గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్: నీట మునిగిన విశాఖ ఎయిర్‌పోర్ట్

గులాబ్ తుఫాన్ కారణంగా విశాఖ ఎయిర్ పోర్టు నీట మునిగింది. ఈ ప్రభావంతో  ఉత్తరాంధ్ర జిల్లాలపై తీవ్ర ప్రభావం కన్పించింది. ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు. కృష్ణా జిల్లాలపై ఈ తుఫాన్ ప్రభావం కన్పించింది.

Visakhapatnam airport flooded after heavy rainfall
Author
Visakhapatnam, First Published Sep 27, 2021, 6:52 PM IST

విశాఖపట్టణం: గులాబ్ తుఫాన్ (cyclone gulab) ప్రభావంతో విశాఖ (visakhapatnam) జిల్లాలో భారీ  (heavy rains)వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షంతో విశాఖపట్టణంలోని ఎయిర్ పోర్టు నీట మునిగింది.ఉత్తరాంధ్ర జిల్లాలపై గులాబ్ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కన్పించింది.  భారీ వర్షం కురవడంతో విశాఖ నగరం నీట ముగినింది. విశాఖ పట్టణంలోని ఎయిర్ పోర్టు నీట మునిగింది. దీంతో విమానాల రాకపోకలు అంతరాయం ఏర్పడింది.

also read:గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్: హైద్రాబాద్‌లో కుండపోత,లోతట్టు ప్రాంతాలు జలమయం

గులాబ్ తుఫాన్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని 14 జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు  జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కూడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. గులాబ్ తుఫాన్ ప్రభావంతో ఒడిశా, ఛత్తీస్‌ఘడ్, ఒడిశా రాష్ట్రాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

 


 

Follow Us:
Download App:
  • android
  • ios