విశాఖలో నీతిఆయోగ్ సీఈఓ అమితాబ్‌కాంత్ టూర్: స్టీల్‌ప్లాంట్ కార్మికుల నిరసన


విశాఖ స్టీల్ ప్లాంట్ పరిశీలనకు వచ్చిన నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ కు నిరసన సెగ తగిలింది.  విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు అమితాబ్ కాంత్ బస చేసిన గెస్ట్ హౌస్ వద్ద నిరసనకు దిగారు.
 

Visakha steel plant workers protest against Niti Aayog CEO Tour

విశాఖపట్టణం: విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్ ను  నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ గురువారం నాడు  పరిశీలించేందుకు వచ్చారు. ఈ విషయం తెలుసుకొన్న స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆందోళనకు దిగారు.

నీతిఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్  హిల్ టాప్ గెస్ట్ హౌస్ వద్ద బస చేసిన విషయం తెలుసుకొన్న కార్మికులు అక్కడకు వెళ్లిన నిరసనకు దిగారు. అమితాబ్ కాంత్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. 

స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించవద్దని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల నిరసనలతో విధులకు హాజరయ్యేందుకు వచ్చిన ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. స్టీల్ ప్లాంట్ ను వందశాతం ప్రైవేటీకరిస్తామని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా ప్రకటించింది. ఈ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మికులు ఆందోళనలు చేస్తున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించొద్దని రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఆందోళనలు చేస్తున్నాయి. అసెంబ్లీ లో కూడ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసింది.  ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కూడ ఏపీకి చెందిన ఎంపీలు ఈ విషయమై నిరసనకు దిగారు. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios