విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద కార్మిక సంఘాల ఆందోళన: విధులకు వెళ్లకుండా ఉద్యోగుల అడ్డగింత
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మిక సంఘాల జేఎసీ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతమౌతోంది. కేంద్ర ప్రభుత్వం ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను నిరసిస్తూ కార్మిక సంఘాలు గురువారం నాడు ఫ్యాక్టరీ పరిపాలన భవనం ఎదుట ఆందోళన నిర్వహించాయి.
విశాఖపట్టణం: విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారంనాడు ఆందోళనకు దిగారు. విధులకు హాజరౌతున్న ఉద్యోగులను జేఎసీ నేతలు అడ్డుకొన్నారు.స్టీల్ ప్లాంట్ పరిపాలన భవనం వద్ద కార్మికులు ఆందోళనకు దిగారు. స్టీల్ ప్లాంట్ విషయంలో ఏపీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అపిడవిట్ పై కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
వంద శాతం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరిస్తామని కేంద్రం ఏపీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఆగష్టు 1,2 తేదీల్లో ఛలో పార్లమెంట్ ను నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నాయి.కేంద్ర ప్రభుత్వం మాత్రం ఉక్కు ఫ్యాక్టరీన ప్రైవేటీకరణ విషయంలో వెనక్కు తగ్గబోమని కేంద్రం తేల్చి చెప్పింది. అయితే కార్మిక సంఘాలు కూడ తమ ఆందోళనను ఉధృతం చేస్తాయని ప్రకటించాయి.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అధికార వైసీపీతో పాటు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ కూడ వ్యతిరేకిస్తున్నాయి. ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకొంటామని రాజకీయ పార్టీలు చెబుతున్నాయి.