సూసైడ్ నోట్ రాసి కనిపించకుండా పోయిన విశాఖ ఉక్కు ఉద్యోగి
సూసైడ్ నోట్ రాసి పెట్టి విశాఖ ఉక్కు కర్మాగారం ఉద్యోగి కనపించకుండా పోయాడు. దాంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తోటి ఉద్యోగులు ఆయన కోసం గాలిస్తున్నారు.
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ ఉక్కు కర్మాగారం పోరులో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. విశాఖ ఉక్కు ఉద్యోగి శ్రీనివాస రావు శనివారం ఉదయం నుంచి కనపించకుండా పోయాడు. ఓ సూసైడ్ నోట్ రాసి పెట్టి ఆయన అదృశ్యమయ్యాడు. దీంతో శ్రీనివాస రావు కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవతున్నారు.
శ్రీనివాస రావు కోసం తోటి ఉద్యోగులు గాలిస్తున్నారు. తాను సాయంత్రం ఫర్నేస్ మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకుంటానని అతను సూసైడ్ నోటులో రాశాడు. దీంతో తీవ్ర కలకలం చేలరేగింది. తాను సాయంత్రం 5 గంటల 49 నిమిషాలకు ఆత్మహత్య చేసుకుంటానని తెలిపాడు.
అందరూ కలిసికట్టుగా ఉద్యమం సాగిస్తేనే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను ఆపగలమని ఆయన అన్నారు. 32 మంది ప్రాణాల త్యాగాల ఫలితంగా ఉక్కు కర్మాగారం విశాఖకు వచ్చిందని ఆయన చెప్పారు. ఎట్టి పరిస్థితిలోనూ విసాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం కాకుండా చూడాలని ఆయన అన్నారు. విశాఖ ఉక్కు కార్మిక గర్జన ఉద్యమంలో ఓ మైలురాయి కావాలని ఆయన ఆశించారు.
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. దానికి వ్యతిరేకంగా ఉద్యోగులు, కార్మికులు ఆందోళనలు సాగిస్తున్నారు ఓ వైపు ఆందోళనలు సాగుతున్న తరుణంలోనే మరోవైపు ప్రైవేటీకరించక తప్పదంటూ కేంద్రం ప్రకటనలు చేస్తూ వస్తోంది.