కారణమిదీ: విశాఖలో కేఏపాల్ చిత్రపటానికి పాలాభిషేకం

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫోటోకు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు శుక్రవారం నాడు పాలాభిషేకం చేశారు.

visakha steel plant employees milk bath to KA paul photo in vizag lns

విశాఖపట్టణం: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫోటోకు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు శుక్రవారం నాడు పాలాభిషేకం చేశారు.

విశాఖస్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ కేఏపాల్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేంద్రం తీసుకొన్న నిర్ణయాన్ని ఆయన సవాల్ చేశారు.

విశాఖలోని కూర్మన్నపాలెం జంక్షన్ వద్ద పాల్ చిత్రపటానికి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు పాలాభిషేకం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ వేసినందుకు పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకొన్నారు.


స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకొన్న విషయాన్ని ఈ పిటిషన్ లో పాల్ గుర్తు చేశారు. క్యాపిటివ్ మైనింగ్ అంశంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కు లీజు అనుమతులు వచ్చేలా చూడాలని ఆయన కోరారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు లీజు అనుమతులు వచ్చేలా చూడాలని కోరారు.  ప్రభుత్వం అనుమతి ఇస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్దికి విరాళాలు సేకరిస్తానని ఆయన ప్రకటించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ కేసులో కేంద్ర మైనింగ్ శాఖ, కేంద్ర స్టీల్ శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదులుగా ఆయన చేర్చారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios