విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం పారిశ్రామికవాడలో విషాద వాతావరణం నెలకొంది. జీవీఎఎసీ 61వ వార్డు నుంచి కార్పోరేటర్ దాడి సూర్యకుమారి ఆకస్మికంగా మరణించారు. 

సూర్యకుమారి మృతితో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇటీవల జరిగిన విశాఖ మహాగనగర పాలక సంస్థ (జీవీఎంసీ) ఎన్నికల్లో సూర్యకుమారి 61వ వార్డు నుంచి కార్పోరేటర్ గా విజయం సాధించారు.  వివరాలు తెలియాల్సి ఉంది.

విశాఖ మేయర్ పదవి వైసీపీ కైవసం అయిన విషయం తెలిసిందే. గ్రేటర్ విశాఖ కార్పోరేషన్ ఎన్నికల్లో వైసీపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది.