నెల్లూరు: నెల్లూరు జిల్లాలో బోరు బావిలో పడిన ఇద్దరు చిన్నారుల్లో  ఒకరిని సురక్షితంగా బయటకు తీయగా.. మరోకరిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.

నెల్లూరు జిల్లాలోని  విడవలూరు మండలం ఊటుకూరు పెదపాలెంలో బోరు బావిలో ఇద్దరు చిన్నారులు సోమవారం నాడు పడ్డారు. బోరు బావిలో 10 అడుగుల లోతులో చిన్నారులు పడిపోయారు.

ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే 10 అడుగుల లోతులో చిక్కుకొన్న చిన్నారిని వెలికితీశారు. మరో చిన్నారిని వెలికితీసేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు.