Asianet News TeluguAsianet News Telugu

మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌: సిబ్బంది నిర్లక్ష్యం.. సెకండ్ డోస్‌గా కోవాగ్జిన్‌కు బదులు కోవిషీల్డ్‌

చిత్తూరు జిల్లా గుడయానంపల్లి గ్రామంలో కోవిడ్ వ్యాక్సిన్ మార్చి వేయడంతో గ్రామస్తులు కలవరపడుతున్నారు. తొలి డోసు కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేశారు. నిన్న మెగా డ్రైవ్‌లో 31 మందికి రెండో డోసు కోవాగ్జిన్ వేశారు.

villagers get mixed covishield and covaxin shots in chittoor district ksp
Author
Chittoor, First Published Jun 21, 2021, 10:26 AM IST

చిత్తూరు జిల్లా గుడయానంపల్లి గ్రామంలో కోవిడ్ వ్యాక్సిన్ మార్చి వేయడంతో గ్రామస్తులు కలవరపడుతున్నారు. తొలి డోసు కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేశారు. నిన్న మెగా డ్రైవ్‌లో 31 మందికి రెండో డోసు కోవాగ్జిన్ వేశారు. దాంతో వారికి ఏమవుతుందోనని గ్రామస్తులు, కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరిగినా వైద్య ఆరోగ్య శాఖాధికారులు గ్రామం వైపు కన్నెత్తి చూడటం లేదని వారు ఆరోపిస్తున్నారు. 

Also Read:ఏపీలో మెగా వ్యాక్సినేషన్: 8 లక్షల మందికి వ్యాక్సిన్ టార్గెట్

కరోనాపై పోరాటంలో ఆంధ్రప్రదేశ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం పెంచింది. ఈ క్రమంలోనే రాష్ట్రం నయా రికార్డ్ క్రియేట్ చేసింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కొద్ది వారాలుగా విస్తృతంగా వ్యాక్సినేషన్ చేస్తుండగా.. ఒక్క రోజులోనే 13లక్షల మందికి పైగా వ్యాక్సినే వేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఉదయం 6 గంటలకు వ్యాక్సినేషన్ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం.. మధ్యాహ్నం 2 గంటలకే 7లక్షల 88వేల 634మందికి వ్యాక్సిన్ వేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా 2,232 కేంద్రాల్లో డ్రైవ్‌ నడవగా.. 45ఏళ్లు పైబడిన వారు, ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు వ్యాక్సినేషన్‌ వేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో 1.43 లక్షల మందికి, కృష్ణా జిల్లాలో 1.31 లక్షల మందికి, విశాఖ జిల్లాలో 1.10 లక్షల మందికి, గుంటూరు జిల్లాలో 1.01 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios