Asianet News TeluguAsianet News Telugu

రేపు ఐజీఎంసీ స్టేడియంలో వైఎస్సార్సీపీ బీసీ మహాసభ.. భారీ ఏర్పాట్లు

Vijayawada: విజయవాడలోని ఐజీఎంసీ స్టేడియంలో 'జయహో బీసీ మహాసభ' ఏర్పాట్లను వైయస్ ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి సోమవారం సమీక్షించారు. బీసీ మహాసభలో బీసీ నేతలు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగిస్తారని తెలిపారు.
 

Vijayawada : YSRCP BC Mahasabha on December 7 at IGMC Stadium;Huge arrangements
Author
First Published Dec 6, 2022, 1:58 AM IST

YSRCP - Jayaho BC Mahasabha: డిసెంబర్ 7న విజయవాడలోని ఐజీఎంసీ స్టేడియంలో 'జయహో బీసీ మహాసభ' నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని బీసీ మహాసభ కోఆర్డినేషన్ కమిటీ సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. బీసీ మహాసభను ఉద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, బీసీ నేతలు ప్రసంగిస్తారని తెలిపారు. సోమవారం ఐజీఎంసీ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను కమిటీ సభ్యులతో కలిసి విజయసాయిరెడ్డి పరిశీలించారు. అనంతరం విజయసాయి మీడియాతో మాట్లాడుతూ బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు, బీసీలకు సామాజిక న్యాయం జరిగేలా జయహో బీసీ మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో బిసిలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడమే బీసీ మహాసభను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

ఐజీఎంసీ స్టేడియంలో నిర్వ‌హించే 'జయహో బీసీ మహాసభ' కుపెద్ద సంఖ్యలో బీసీ సర్పంచులు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు సభకు హాజరవుతారనీ, ఇందుకు సంబంధించి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని విజయసాయిరెడ్డి చెప్పారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు బీసీ నేతలు సభలో ప్రసంగిస్తారని తెలిపారు. సమావేశానికి హాజరయ్యే బీసీలకు రవాణా, భోజన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ మహా సభలు కూడా తర్వాత నిర్వహిస్తామని చెప్పారు. బీసీలు ఇతర కులాలతో సమానంగా అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ధ్యేయమని విజయసాయి అన్నారు.

వెనుకబడిన తరగతుల సంక్షేమం, అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. బీసీలు ఉన్నత ఉద్యోగాలు పొందేలా విద్యను ప్రోత్సహించడానికి సీఎం జగన్ కృషి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను 80 శాతానికి పైగా బీసీలు సద్వినియోగం చేసుకుంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ముత్యాలనాయుడు, వెంకట నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, లేళ్ల అప్పిరెడ్డి, పోతుల సునీత తదితరులు పాల్గొన్నారు.

 

ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. "స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో బాబు, లోకేశం నొక్కేసిన 241 కోట్ల గురించి అక్షరం కూడా రాయలేదు ధృతరాష్ట్ర మీడియా పాగల్. సీమెన్స్ కంపెనీ పేరుతో నకిలీ ‘సీమెన్స్’ షెల్ కంపెనీలకు, మనీ లాండరింగ్ ద్వారా సింగపూరుకు తరలించినా, ముసుగుకప్పావు కదా బొల్లి ముసలి నాయుడు" అంటూ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.

Follow Us:
Download App:
  • android
  • ios