విజయవాడ నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఓ వృద్ధురాలిపై అత్యాచారానికి బ్లేడ్ బ్యాచ్ అత్యాచారానికి పాల్పడింది. ఆమెను నగ్నంగా మార్చి.. దారుణంగా హింసించారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రగాయాలతో.. రక్త స్రావంతో వృద్ధురాలు రైల్వే స్టేషన్ సమీపంలో పడిపోయి ఉంది.

అపస్మార స్థితిలో ఉన్న ఆమెను గమనించిన రైల్వేస్టేషన్ లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు గమనించారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె కోలుకుంటే తప్ప అసలు ఏం జరిగిందో తెలియదని పోలీసులు చెబుతున్నారు. ఆమె మెడ మీద గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ప్రైవేట్ పార్ట్స్ వద్ద కూడా గాయాలు ఉన్నట్లు  చెబుతున్నారు. బాధితురాలు కృష్ణా జిల్లా వుయ్యూరు కి చెందిన నాంచారమ్మ గా గుర్తించారు. 

డబ్బు కోసం ఆమెపై దాడి చేసి అనంతరం అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.