Asianet News TeluguAsianet News Telugu

వ‌చ్చే నెల‌లో ఏపీలో ప‌రుగులు పెట్ట‌నున్న వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు

Vijayawada: ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు కేటాయించిన రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు 2023 జ‌న‌వ‌రిలో ప్రారంభం కానున్నాయి. భారత రైల్వే శాఖ రాష్ట్రానికి రెండు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను కేటాయించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వేకు కేంద్ర రైల్వే శాఖ నుంచి సమాచారం అందింది.
 

Vijayawada : Vande Bharat Express trains to run in AP next month
Author
First Published Dec 10, 2022, 2:56 AM IST

Vande Bharat Express trains: ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు కేటాయించిన రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు 2023 జ‌న‌వ‌రిలో ప్రారంభం కానున్నాయి. భారత రైల్వే శాఖ రాష్ట్రానికి రెండు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను కేటాయించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వేకు కేంద్ర రైల్వే శాఖ నుంచి సమాచారం అందింది. దీంతో  ఆయా మార్గాల్లో రైలు ప్ర‌యాణ స‌మ‌యం మ‌రింత త‌గ్గ‌నుంది. 

వివ‌రాల్లోకెళ్తే.. భారతీయ రైల్వే శాఖ ఆంధ్ర‌ప్రదేశ్ కు రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కేటాయించింది. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ నుంచి దక్షిణ మధ్య రైల్వేకు సమాచారం అందింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను సికింద్రాబాద్-విజయవాడ మధ్య జనవరి 2023లో నడపాలని నిర్ణయించారు. అయితే అధికారిక తేదీని త్వరలో ఖరారు చేయనున్నారు. ఈ రైలు గంటకు 165 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. సికింద్రాబాద్ నుండి కాజీపేట మీదుగా విజయవాడ వరకు 1,129 మంది సీటింగ్ కెపాసిటీని కలిగి ఉంటుంది. తర్వాత విశాఖపట్నం వరకు విస్తరిస్తారు. రెండవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడుస్తుంది. ఈ రైలును సికింద్రాబాద్ నుంచి విజయవాడ మీదుగా తిరుపతికి నడపాలని దక్షిణ మధ్య రైల్వే కోరుతోంది. ఈ రైలు మార్గంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

సాధ్యాసాధ్యాలు, స్టాక్ లభ్యత ఆధారంగా వందే భార‌త్ ఎక్స్ ప్రెస్ రైలు మార్గంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి కూడా తిరుపతికి ప్రయాణించే భక్తుల సంఖ్యను పరిగణనలోకి తీసుకొని తిరుపతికి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కోసం అభ్యర్థించారు. ప్రతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో మొత్తం 1,128 మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యం ఉంది. జీపీఎస్ ఆధారిత ఆడియో-విజువల్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, వినోద ప్రయోజనాల కోసం ఆన్బోర్డ్ హాట్ స్పాట్ వై-ఫై, సౌకర్యవంతమైన సీటింగ్ లు దీని ప్ర‌త్యేక‌త‌. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గరిష్టంగా గంటకు 160 కిలోమీటర్ల  వేగంతో నడుస్తుంది. ప్రస్తుతం కాజీపేట మీదుగా సికింద్రాబాద్-విజయవాడ మార్గంలో ఈ రైలు గరిష్టంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్ర‌యాణం స‌మ‌యాన్ని మ‌రింత‌గా త‌గ్గించ‌నుంది. అలాగే, సౌక‌ర్య‌వంత‌మైన ప్ర‌యాణ అనుభూతిని క‌లిగిస్తుంది.

నాగ్‌పూర్-హైదరాబాద్ మధ్య వంద భారత్ ఎక్స్‌ప్రెస్ ! 

భారతీయ రైల్వే ఆరవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండగా, సమీప భవిష్యత్తులో నాగ్‌పూర్ నుండి హైదరాబాద్ మధ్య వంద భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయ‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. మీడియా రిపోర్టులు ప్ర‌కారం.. నాగ్‌పూర్ నుండి హైదరాబాద్‌కు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర క్యాబినెట్ మంత్రి సుధీర్ ముంగంటివార్ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు లేఖ రాశారు. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి చెందిన నాగ్‌పూర్, గోండియా, భండారా, చంద్రపూర్ జిల్లాలు తెలంగాణలోని హైదరాబాద్‌తో మంచి వాణిజ్య వ్యాపారం కలిగి ఉన్నాయని ముంగంటివార్ లేఖలో బుధవారం చంద్రపూర్ జిల్లా సమాచార కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.

నాగ్‌పూర్-హైదరాబాద్ మార్గంలో ప్రస్తుతం 22 రైళ్లు నడుస్తున్నప్పటికీ, ఈ దూరాన్ని 575 కిలో మీట‌ర్ల  దూరం ప్రయాణించడానికి ఒక ఫాస్ట్ రైలు తప్పనిసరిగా ఉండాలని గోండియా, చంద్రాపూర్ జిల్లాల సంరక్షక మంత్రి అయిన ముంగంటివార్ తెలిపారు. ఈ ప్రాంతానికి వచ్చే పర్యాటకులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తల సౌకర్యార్థం నాగ్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌ను కలుపుతూ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను వీలైనంత త్వరగా ప్రారంభించాల్సిన అవసరం ఉందని మంత్రి చెప్పారు. ప్రభుత్వం వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభిస్తే విదర్భలోని నాలుగు జిల్లాలకు మేలు జరుగుతుందన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios