వచ్చే ఎన్నికల్లో నేను, నా కుమార్తె పోటీ చేయం: బాబుకు తేల్చిచెప్పిన కేశినేని నాని

టీడీపీ అధిష్టానం తీరుపై విజయవాడ ఎంపీ కేశినేని నాని అసంతృప్తిగా వున్నట్లు తెలుస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనని ఆయన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు చెప్పినట్లుగా తెలుస్తోంది. అలాగే తన కుమార్తె కూడా ఇకపై ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయడదని నాని చెప్పినట్లుగా సమాచారం.

vijayawada tdp mp kesineni nani sensational comments on party high command

టీడీపీ అధిష్టానం తీరుపై విజయవాడ ఎంపీ కేశినేని నాని అసంతృప్తిగా వున్నట్లు తెలుస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనని ఆయన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు చెప్పినట్లుగా తెలుస్తోంది. అలాగే తన కుమార్తె కూడా ఇకపై ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయడదని నాని చెప్పినట్లుగా సమాచారం. కొద్దిరోజుల క్రితం విజయవాడలో జరిగిన  టీడీపీ చీఫ్ చంద్రబాబు పర్యటనకు కూడా కేశినేని దూరంగా వున్నారు. 

విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల సమయంలో నగర పార్టీ నేతల మధ్య వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, బొండా ఉమా.. కేశినేని నానిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనికి నాని కూడా కౌంటరిచ్చారు. ప్రధానంగా ఆయన కుమార్తెకు మేయర్ సీటు విషయంలోనే ఈ వివాదం రేగింది. దీనిని సీరియస్‌గా తీసుకున్న చంద్రబాబు .. నేతలంతా సర్దుకుపోవాలని సూచించారు. అయితే తనపై నగర పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో నాని మనస్తాపానికి గురైనట్లుగా తెలుస్తోంది. 

ALso Read:చంద్రబాబుకు హెచ్చరికలు: కేశినేనిపై బోండా ఉమా, బుద్ధా తీవ్ర వ్యాఖ్యలు

ఎంపీ కాళ్లు విరగ్గొడతాను అంటూ సొంత పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలను పార్టీ పెద్దలు పట్టించుకోవడం లేదని నాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో నాటి నుంచి పార్టీ కార్యక్రమాలకు నాని దూరంగా వుంటున్నారు. కానీ ఎంపీగా మాత్రం అధికారిక కార్యక్రమాలకు ఆయన హాజరవుతున్నారు.  ఈ పరిణామాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తాను, తన కుమార్తె పోటీ చేయకూడదని కేశినేని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. మరి నాని నిర్ణయంపై హైకమాండ్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios