Asianet News TeluguAsianet News Telugu

ఆ వీలునామా చెల్లదు: బ్రహ్మంగారి పీఠాధిపతి ఎంపికపైశివస్వామి సంచలనం

: వీరభోగవెంకటేశ్వరస్వామి రెండో భార్య మహాలక్ష్మమ్మ వద్ద ఉన్న వీలునామా చెల్లదని విజయవాడకు చెందిన పీఠాధిపతి శివ స్వామి చెప్పారు.

Vijayawada siva swamy sensational comments on Brahmmamgari matam dean selection lns
Author
Kadapa, First Published Jun 13, 2021, 3:53 PM IST

కడప: వీరభోగవెంకటేశ్వరస్వామి రెండో భార్య మహాలక్ష్మమ్మ వద్ద ఉన్న వీలునామా చెల్లదని విజయవాడకు చెందిన పీఠాధిపతి శివ స్వామి చెప్పారు.ఆదివారంనాడు ఆయన కందిమల్లాయిపల్లె గ్రామానికి మరో 13 మందితో కలిసి ఆయన సందర్శించారు. బ్రహ్మంగారి మఠాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపిక విషయంలో తాము ప్రభుత్వం తరపున  ప్రతినిధిగా రాలేదన్నారు.విశ్వధర్మ పరిరక్షణ వేదిక తరపున వివాదానికి తెర దింపే ప్రయత్నం చేసేందుకు వచ్చామని ఆయన తెలిపారు. 

దేవాదాయశాఖతో సంబంధం లేకుండా పీఠాధిపతిని ఎంపిక చేస్తామని ఆయన చెప్పారు. వారసత్వంగా పెద్ద కొడుకు వెంకటాద్రికే పిఠాధిపతి పదవి  దక్కనుందని ఆయన చెప్పారు.బ్రహ్మంగారి మఠానికి ప్రత్యేకాధికారిని నియమించడం సంతోషమన్నారు. బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి విషయంలో కుటుంబంలో వివాదం చోటు చేసుకొంది.

also read:బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి ఎంపికలో వీలునామా అందలేదు: మంత్రి వెల్లంపల్లి

వీరభోగ వెంకటేశ్వరస్వామి మొదటి భార్య కొడుకు వెంకటాద్రికే ఇవ్వాలని కందిమల్లాయిపల్లి గ్రామస్తులు కోరుతున్నారు. రెండో భార్య మహాలక్ష్మమ్మ కొడుకుకు  పీఠాధిపతి పదవిని కట్టబెట్టాలని వీలునామా తెరమీదికి వచ్చింది.అయితే ఈ వీలునామా దేవాదాయశాఖకు 90 రోజుల్లో చేరాలనే నిబంధన ఉంది. అయితే ఇప్పటివరకు తమకు ఎలాంటి వీలునామా రాలేదని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios