గుంటూరు: వైసీపీ నేత లక్ష్మీపార్వతి తనను లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారని గుంటూరు జిల్లా వినుకొండ మండలం ఉప్పరపాలెం‌ గ్రామానికి చెందిన కోటి అలియాస్ ఆనందపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

గురువారం నాడు వినుకొండ సీఐకు  కోటి  రాత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు.  లక్ష్మీపార్వతి తనతో చేసిన వాట్సాప్ చాటింగ్‌తో పాటు ఆమె గతంలో తనతో దిగిన ఫోటోలను కూడ ఆయన సాక్ష్యాలుగా చూపించారు. 

ఈ చాటింగ్‌లో ఐలవ్యూ కోటి, నన్ను అర్ధం చేసుకో ప్లీజ్ ప్లీజ్ అని ఈ చాటింగ్‌లో ఉంది. ఈ చాటింగ్‌లో ఎన్టీఆర్‌పై ఆమె విమర్శలు చేసినట్టుగా ఉంది.  ఎన్టీఆర్ తనకు అన్యాయం చేశాడని.. ఓ నమ్మకద్రోహి అంటూ చాటింగ్‌లో ఉందని  కోటి చెప్పారు. కోటి నా మీద అలిగావా... జగన్‌తో మాట్లాడి నిన్ను పాలిటిక్స్‌లో పెద్దవాడిని చేద్దామనుకొన్నా... వైసీపీలో మంచి పోస్టు ఇప్పించాలని భావిస్తున్నానని ఆమె చాటింగ్ చేసిందని కోటి చెప్పారు.ఈ ఆధారాలను ఆయన పోలీసులకు సమర్పించారు.

కొన్ని ఫోర్న్ వీడియోల లింక్‌లు, క్లిప్పింగ్‌ల లింకులను కూడ చాటింగ్‌లో ఆమె పంపారని ఆయన ఆరోపిస్తున్నారు. తాను ప్రేమతో పంపితే నిన్ను వేధిస్తున్నట్టుగా ఎలా అవుతోందని లక్ష్మీపార్వతి  తనతో చాటింగ్ చేశారని కోటి  ఫిర్యాదులో పేర్కొన్నారు.

నాలుగేళ్ల క్రితం తనకు లక్ష్మీపార్వతి పరిచయమైనట్టుగా కోటి ఫిర్యాదులో చెప్పారు. ఓ సినిమా గురించి సంప్రదించినప్పుడు ఆమె పరిచయమైనట్టుగా ఆయన తెలిపారు. అప్పటి నుండి ఆమెకు చేదోడు వాదోడుగా ఉన్నట్టుగా ఆయన గుర్తు చేశారు. కానీ, 18 నెలలుగా లక్ష్మీపార్వతి ప్రవర్తన బాగా లేదని ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.