బెజవాడలో నాలుగు లోన్ యాప్ కేసులు.. అప్రమత్తంగా ఉండాలన్న సీపీ
ఆన్ లైన్ యాప్ లతో డబ్బులు అప్పులకు తీసుకునేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలన్నారు విజయవాడ పోలీస్ కమీషనర్ బత్తిన శ్రీనివాసులు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రుణాల పేరుతో వస్తున్న యాప్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు
ఆన్ లైన్ యాప్ లతో డబ్బులు అప్పులకు తీసుకునేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలన్నారు విజయవాడ పోలీస్ కమీషనర్ బత్తిన శ్రీనివాసులు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రుణాల పేరుతో వస్తున్న యాప్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
అవసరమైతే పోలీసులను ఆశ్రయించాలని.. ఆన్ లైన్ యాప్ లను డౌన్ లోడ్ చేసుకోవద్దని సీపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి యాప్‌లను డౌన్ లోడ్ చేయడం ద్వారా వారి వ్యక్తిగత వివరాలు సైబర్ నేరస్తుల చేతికి వెళ్తాయని కమీషనర్ చెప్పారు.
Also Read:యాప్‌ల మాయలో పడొద్దు.. మీ డేటా ఇవ్వొద్దు: ఆర్‌బీఐ
70 ఆన్ లైన్ యాప్‌ల ద్వారా బాధితులు మోసపోతున్నట్లు తాము గుర్తించామన్నారు. ఇప్పటికే అజిత్ సింగ్ నగర్, కొత్తపేట, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ల పరిధిలో నాలుగు కేసులు నమోదైనట్లు శ్రీనివాసులు తెలిపారు.
వారిపై పీటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశామన్నారు. ఈ యాప్ ల ద్వారా వేధింపులకు గురైన వారు పోలీసులను ఆశ్రయించవచ్చని కమీషనర్ సూచించారు. నిన్న టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దాడి ఘటనపై సీపీ స్పందించారు.
వీరిరువురు ఈనెల 12న గొడవ పడ్డారని.. జ్ఞానదీప్, మహేష్ స్నేహితులని శ్రీనివాసులు చెప్పారు. ఇంద్రకీలాద్రి సింహ వాహనాల చోరీపై చాలామందిని విచారించామని, ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో వుందని పోలీస్ కమీషనర్ పేర్కొన్నారు.