స్వర్ణ ప్యాలెస్‌లో అగ్ని ప్రమాదం: ముగ్గురి అరెస్ట్
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో అగ్ని ప్రమాదం జరిగిన ఘటనలో సోమవారం నాడు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
విజయవాడ:
విజయవాడ: విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో అగ్ని ప్రమాదం జరిగిన ఘటనలో సోమవారం నాడు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
స్వర్ణ ప్యాలెస్ జనరల్ మేనేజర్ సుదర్శన్, చీఫ్ ఆపరేటర్ రాజగోపాల్ రావుతో పాటు నైట్ మేనేజర్ వెంకటేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.ఆదివారం నాడు ఉదయం స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో 10 మంది కరోనా రోగులు మరణించారు.
also read:స్వర్ణ ప్యాలెస్‌లో అగ్ని ప్రమాదం: విస్తృతంగా పోలీసుల సోదాలు
సోమవారం నాడు మధ్యాహ్నం స్వర్ణ ప్యాలెస్ యజమాని ముత్తవరపు శ్రీనివాస్, రమేష్ ఆసుపత్రిలో, స్వర్ణ ప్యాలెస్ హోటల్ వద్ద పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు.
పోలీసులు మూడు బృందాలుగా విచారణ నిర్వహిస్తున్నారు. మరో వైపు స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించలేదని అధికారులు గుర్తించారు.
మరో వైపు 48 గంటల్లో ఈ ఘటనపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని జేసీ శివశంకర్ ను ప్రభుత్వం ఆదేశించింది. కోవిడ్ సెంటర్ లో ఫీజులు ఎంత వసూలు చేస్తున్నారు. ఏ రకమైన ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. రమేష్ ఆసుపత్రిలో ఏ రకంగా ట్రీట్ మెంట్ ఇస్తున్నారనే విషయమై ఆరా తీస్తున్నట్టుగా జేసీ శివశంకర్ ప్రకటించారు.
రమేష్ ఆసుపత్రి స్వర్ణ ప్యాలెస్ హోటల్ ను కోవిడ్ సెంటర్ గా ఉపయోగిస్తున్నారు. ఆరు మాసాలుగా ఈ హోటల్ ను కోవిడ్ సెంటర్ గా ఉపయోగిస్తున్నారు.
కోవిడ్ సెంటర్ లో మెడికల్ సర్వీసెస్ మాత్రమే తాము నిర్వహిస్తున్నామని రమేష్ ఆసుపత్రి ఎండీ రమేష్ ప్రకటించారు.