విజయవాడ: విజయవాడ కనకదుర్గ అమ్మవారి రథంపై వెండి సింహాల ప్రతిమల మాయం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఇద్దరిని పోలీసులు బుధవారం నాడు అదుపులోకి తీసుకొన్నారు.

విజయవాడ దుర్గమ్మ రథంపై సింహాల ప్రతిమలు మాయమయ్యాయి. 2020 సెప్టెంబర్ 16వ తేదీన ఈ సింహాల విగ్రహాలు అదృశ్యమైనట్టుగా గుర్తించారు.విగ్రహాల అదృశ్యం కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఆందోళనలు జరిగాయి. 

also read:దుర్గగుడి రథంపై వెండి సింహాల ప్రతిమల మాయం: కీలక విషయాలు గుర్తింపు

దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ విగ్రహాల అదృశ్యాన్ని తేల్చేందుకు సిట్ ను ఏర్పాటు చేసింది.పదుల సంఖ్యలో అనుమానితులను విచారించారు.సిట్ విచారణలో పురోగతి లభించింది. ఈ ఘటనలో ఒక నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ కేసులో  ముఠా గురించి పోలీసులు విచారణ చేస్తున్నారు. నిందితుడిపై గతంలో కొన్ని కేసులు కూడ ఉన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు.

అంతరాష్ట్ర ముఠానే ఈ చోోరీకి పాల్పడిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ముఠా సభ్యుల వివరాలను పోలీసులు లోతుగా పరిశీలిస్తున్నారు.  త్వరలోనే నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.