కండ్రిగకు చెందిన రామారావుగా విజయవాడలో దారుణ హత్యకు గురవగా... సాంకేతిక ఆధారాలతో హత్యకు పాల్పడిన ఏడుగురిని అరెస్టు చేసినట్లు డిసిపి విక్రాంత్ పాటిల్ వెల్లడించారు.  

విజయవాడ నగరంలో ఇటీవల సంచలనం రేకెత్తించిన మర్డర్ కేసును ఎట్టకేలకు చేధించారు. దుర్గా అగ్రహారంలో జరిగిన హత్యతో సంబంధమున్న ఏడుగురిని అరెస్టు చేసినట్లు డీసీపీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. హతుడు కండ్రిగ కు చెందిన రామారావుగా గుర్తించామని... సాంకేతిక ఆధారాలతో ఏడుగురిని అరెస్టు చేసామని డిసిపి వెల్లడించారు. 

గత నెల 16న ఒక ప్రేమ పంచాయితీ జరిగిందని... మైనర్ బాలిక బాబాయి మురళి ఈ పంచాయితీ చేశారని డిసిపి తెలిపారు. ఈ క్రమంలోనే కొరుకూరి రవీంద్ర రెండుసార్లు రామారావుకి ఫోన్ చేసి బెదిరించాడు... ఆ భయంతోనే హత్య చేసినట్లు వెల్లడించారు. రామారావు తనను చంపేస్తాడన్న భయంతోనే రవీంద్ర ఈ దారుణానికి పాల్పడినట్లు డిసిపి తెలిపారు. 

read more విజయవాడలో సైకో వీరంగం.. అర్థరాత్రి ఇళ్లలోకి చొరబడి వికృతచేష్టలు.. !

 అరెస్టయిన ఏడుగురిపై ఇప్పటికే పాత కేసులు ఉన్నాయని తెలిపారు. నిందితులు కోతల‌‌ శివ, కొరుకూరి రవీంద్ర, అశోక్ కుమార్, కరీం, మురళి, వినయ్ కుమార్, నిహాంత్ లను రిమాండ్ కు పంపామన్నారు. తదుపరి విచారణలో ఇంకెవరికైనా ఈ హత్యతో సంబంధముందా అనేది తేలుతుందన్నారు. ఇప్పుడు అరెస్టయిన వారిలో కొందరిపై ఇప్పటికే రౌడీ షీట్ వుందని మిగతావారిపైనా రౌడీషీట్ ఓపెన్ చేస్తామని డిసిపి విక్రాంత్ పాటిల్ వెల్లడించారు.