విజయవాడ ఎంపీ కేశినేనినానికి కరోనా సోకింది. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని శుక్రవారం నాడు ఆయన ప్రకటించారు.కరోనా సోకడంతో ఆయన హోం క్వారంటైన్‌లోకి వెళ్లినట్టుగా తెలిపారు. తాను అన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నట్టుగా ఆయన చెప్పారు. తనను కలిసిన వారంతా కూడ క్వారంటైన్ లోకి వెళ్లాలని ఆయన సూచించారు. అంతేకాదు వారంతా కూడ కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు.

 

 

ఈ నెల 13వ తేదీన సహచర టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, కింజారపు రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్ తో కలిసి ఆయన ఢిల్లీకి వెళ్లారు.  తిరుపతిలో చంద్రబాబు సభలో రాళ్లదాడి ఘటనపై ఈసీకి ఫిర్యాదు చేశారు.ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.  గత 24 గంటల్లో  రాష్ట్రంలో 5 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.  కరోనాతో మరణించే రోగుల సంఖ్య కూడ పెరిగిపోతోంది.  దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడ అప్రమత్తమైంది. ఏపీ  సీఎం వైఎస్ కరోనాపై  గురువారం నాాడు సమీక్ష సమావేశ్ం నిర్వహించారు. ఈ సమావేశంలో