విజయవాడ నగరంలోని మాచవరం వద్ద కారులో డెడ్‌బాడీ ఘటనలో పోలీసులు కొన్ని కీలకమైన ఆధారాలను సేకరించారు. కారులోని కరణం రాహుల్  హత్యకు గురయ్యాడని పోలీసులు నిర్ధారించారు. ఇదే సమయంలో రాహుల్‌ను ముగ్గురు వ్యక్తులు హత్య చేసినట్లు గుర్తించారు. 

బెజవాడలో రాహుల్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ముగ్గురు వ్యక్తులు కలిసి రాహుల్‌ను హత్య చేసినట్లు నిర్ధారించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన వ్యక్తి హస్తం కూడా ఈ హత్యలో వున్నట్లు గుర్తించారు. రాత్రి కారులో మూడు గంటల పాటు ఇరు వర్గాల మధ్య వివాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు పోలీసులు. దిండు, తాడును ఉపయోగించి రాహుల్‌ను హత్య చేసినట్లు గుర్తించారు. నిందితుల కోసం ఐదు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. 

విజయవాడ నగరంలోని మాచవరం వద్ద కారులో డెడ్‌బాడీ ఘటనలో పోలీసులు కొన్ని కీలకమైన ఆధారాలను సేకరించారు. కారులోని కరణం రాహుల్ హత్యకు గురయ్యాడని పోలీసులు నిర్ధారించారు. కారులో దొరికిన ఆధారాల మేరకు ఈ విషయాన్ని ధృవీకరించారు. కారులో ఓ తాడును కూడా పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ తాడు సహయంతోనే రాహుల్ ను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. వ్యాపారంలో ఆర్ధిక లావాదేవీలే హత్యకు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు.

ALso Read:విజయవాడ కారులో డెడ్‌బాడీ: రాహుల్‌ది హత్యేనని నిర్ధారించిన పోలీసులు

డ్రైవింగ్ సీట్లో ఉన్న రాహుల్ కారులోనే మరణించినట్టుగా పోలీసులు గుర్తించారు. కారు షోరూం నుండి మెకానిక్ లను రప్పించి కారు డోర్ ను ఓపెన్ చేసేందుకు ప్రయత్నించారు. తొలుత కారు టైర్ విప్పి డోర్ ఓపెన్ చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో కారు అద్దం పగులగొట్టి డోర్ ఓపెన్ చేశారు. జిల్లాలోని జి.కొండూరు మండలంలో జిక్సిన్ సిలిండర్ల కంపెనీ యజమాని కరణం రాహుల్ అనుమానాస్పద మృతి చెందారు. కారు డోర్ ను ఓపెన్ చేసిన తర్వాత కారు తాళం చెవి ఇంకా లభ్యం కాలేదు. కారు కీ ఎక్కడికి వెళ్లిందనే విషయమై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.